AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నప్పుడు పొట్టపగిలేలా నవ్వుకున్న ‘రెక్కల ఏనుగు’ గుర్తుందా..? 90’s కిడ్స్‌కి ఇష్టమైన కథ

Rekkala Enugu Story: దురాశ, అజాగ్రత్త, అతిశయోక్తి వల్ల మన చేతిలో ఉన్న అవకాశాలు కూడా పోతాయి. వినయం, సమయస్ఫూర్తి, జాగ్రత్త విజయానికి అవసరమని చెప్పే నీతి కథ ఇది. ఇప్పటి వాళ్లకు తెలియదుగానీ.. 90's కిడ్స్‌కి ఎంతో ఇష్టం ఈ కథ. బొమ్మ చూడగానే ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా.. అదే రెక్కల ఏనుగు కథ. మళ్లీ ఓసారి ఈ కథను చదివి హాయిగా నవ్వుకుందాం..

చిన్నప్పుడు పొట్టపగిలేలా నవ్వుకున్న 'రెక్కల ఏనుగు' గుర్తుందా..? 90's కిడ్స్‌కి ఇష్టమైన కథ
Rekkala Enugu Story
Srilakshmi C
|

Updated on: Jul 06, 2026 | 2:25 PM

Share

ఒక ఊరిలో రాజు గారి చెరకు తోట ఉండేది. ఆ తోటలో సూరయ్య, భార్య నరసమ్మ కాపలా ఉండేవారు. అయితే ప్రతిరోజూ రాత్రి ఎవరో వచ్చి తోటలోని చెరకు గడలను తిని పాడుచేస్తుండటాన్ని సూరయ్య గమనిస్తాడు. రాజుకు తెలిస్తే శిక్ష తప్పదని భయపడ్డాడు. దొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో రోజూ సూరయ్య మాటు వేసి కాపలాకాయసాగాడు. పున్నమిరాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లు ఉంది. ఆ రోజు రాత్రి కూడా సూరయ్య తోటలోనే దాక్కుని కాపలా కాస్తున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి ఆకాశం నుంచి ఓ వెలుగు తోటలోకి పడింది. ఆ వెలుగులో నుంచి రెక్కలున్న ఒక తెల్లటి అందమైన ఏనుగు మెల్లగా కిందకు దిగడం చూసి సూరయ్య ఆశ్చర్యపోయాడు. అది స్వర్గం నుండి వచ్చే ఐరావతం. అది తోటలోకి వచ్చి ఎంతో ఇష్టంగా తనకు నచ్చిన చెరకు గడలను తినడం మొదలుపెడుతుంది.

తెలవారుతుండగా.. ఏనుగు ఒక్కసారిగా ఘింకరించి తిరిగి ఆకాశంలోకి ఎగిరింది. వెంటనే సూరయ్య ధైర్యం చేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఏనుగు తోకను గట్టిగా పట్టుకుంటాడు. ఏనుగుతో పాటు సూరయ్య కూడా ఆకాశంలోకి ఎగిరి నేరుగా వింత లోకానికి తీసుకెళ్లాడు. అక్కడ అంతా బంగారు మయం. జంతువులు ఎగురుతున్నాయి. పక్షలు మాట్లాడుతున్నాయి. పాములు పడగలపై నిలబడి నాట్యం చేస్తున్నాయి. సూరయ్య కోరిందే తడవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి. తనకు కావల్సినవన్నీ మూట కట్టుకున్నాడు. మళ్లీ పున్నమి వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని మళ్లీ భూలోకం వచ్చాడు.

సూరయ్య తెచ్చిన ఆ స్వర్గలోకపు సంపదను ఊరిలోని జనాలందరికీ చూపిస్తాడు. కొంత మంది సూరయ్య మాటలు వినలేదు. వారందరినీ వింతలోకం తీసుకెళ్తానని చెబుతాడు. పున్నమిరోజు వారందరినీ తోటకు రమ్మని చెబుతాడు. పున్నమిరోజు రానేవచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుకు రానేవచ్చింది. తనకు కావల్సిన మేసి తెలవారుజామున ఘీంకరించి ఆకాశం వైపు ఎగిరింది. వెంటనే సూరయ్య రెక్కల ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలును మరొకరు ఇలా అందరూ పట్టుకుని గాల్లో వేలాడసాగారు. చివరలో మల్లమ్మ వేలాడుతుంది.

Rekkala Enugu

ఆకాశంలో ఎగురుతున్న సమయంలో.. మల్లమ్మకు ఒక సందేహం వచ్చింది. వింతలోకంలో గుమ్మడికాయ ఎంత సైజులో ఉంటాయి? అని పైనున్న వ్యక్తిని అడిగింది. అతడు ఆపై ఉన్న వారిని.. అలా సూరయ్యకు ఆ ప్రశ్న చేరుతుంది. సూరయ్య తాను గాల్లో ఉన్నానన్న సంగతి మర్చిపోయి ఉత్సాహంగా.. ఇంతింత పెద్దగా ఉంటాయి అని రెండు చేతులు చూపిస్తూ.. ఏనుగు తోకను వదిలేస్తాడు. ఇంకేముంది.. ఒకరి తర్వాత ఒకరు అందరూ నేలపై పడిపోయారు.

నీతి

దురాశకు పోయి, అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఉన్నది కూడా ఊడిపోతుందనేది ఈ కథలోని నీతి. దురాశకు పోయి, సమయస్ఫూర్తి కోల్పోయి, తొందరపడి వ్యవహరిస్తే చేతిలో ఉన్న అవకాశాలు కూడా పోతాయి. రహస్యాలను, విజయాలను గొప్పగా చెప్పుకోవడం వల్ల అనవసర సమస్యలు వస్తాయి. తెలివిగా సంపాదించిన దానిని వినయంగా ఉపయోగించాలి. ప్రదర్శన కోసం ప్రయత్నిస్తే నష్టం కలుగుతుంది.

Follow Us
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?
రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?
ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌