AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో పెద్దవాళ్ల నడుం బలానికి పుష్టినిచ్చే నల్ల కారం.. ఇలా చేశారంటే 4 ముద్దలు ఎక్కువే తినేస్తారు!

ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం, ముఖ్యంగా నడుం బలం కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఈ నల్లకారం రుచి, పోషకాల కలయికతో ప్రత్యేకతను సంతరించుకుంది. ధనియాలు, పప్పులు, వెల్లుల్లి, కరివేపాకు వంటి పదార్థాలతో చేసే ఈ సాంప్రదాయ ఆంధ్ర వంటకం వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఒకసారి ఈ నల్లకారం చేసి ఇంట్లో పెట్టుకుంటే 2, 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. అన్నం, ఇడ్లీ, దోసె ఏదైనా సరే మరింత రుచిగా మారిపోతుంది. అంతేకాదు, ఘుమఘుమలాడే సువాసనతో పాటు ప్రతి ముద్దను ఆస్వాదించేలా చేసి నాలుగు ముద్దలు ఎక్కువే తినేలా చేస్తుంది..

Srilakshmi C
|

Updated on: Jul 05, 2026 | 4:58 PM

Share
నల్లకారం గురించి చాలా మంది వినే ఉంటారు. కానీ దాని తయారీ విధానం అందరికీ పర్‌ఫెక్ట్‌గా రాదు. ఖచ్చితమైన కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో.. అందుకు ఏమేం పదార్ధాలు కావాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఎండు మిరపకాయలు, 100 గ్రాములు (సుమారు 25 - 30), ధనియాలు ½ కప్పు, శనగపప్పు ¼ కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15, చింతపండు చిన్న నిమ్మకాయ పరిమాణంలో, కరివేపాకు 2 పెద్ద గుప్పెలు, ఉప్పు తగినంత (సుమారు 2 టేబుల్ స్పూన్లు), నూనె 1 టేబుల్ స్పూన్.. తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఎండు మిరపకాయల కాడలు తీసి చిన్న ముక్కలుగా విరిచుకోవాలి. వీటిని పాన్‌లో వేసి నూనె వేసి లేతగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో శనగపప్పు, మినప్పప్పు వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. మంట తక్కువగా ఉంచి బంగారు రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. ఈ దినుసుల్లోనే చింతపండు ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి స్వల్పంగా వేయించుకోవాలి. దీంతో కారం పొడికి ప్రత్యేక రుచి వస్తుంది. చివరగా కరివేపాకు వేసి పూర్తిగా తేమ పోయే వరకు వేయించాలి. కరివేపాకు కరకరలాడే స్థితికి రావాలి.

3 / 5
గ్రైండింగ్ కోసం మిక్సీ జార్‌ తీసుకుని ముందుగా ఎండు మిరపకాయలు, ఉప్పు వేసి కొద్దిగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి మెత్తగా లేదా కొద్దిగా దంచినట్టుగా గ్రైండ్ చేయాలి. అంతే రుచికరమైన నల్లకారం రెడీ అయినట్లై..

4 / 5
ఈ కారం చేసేటప్పుడు కరివేపాకులో తేమ ఉండకూడదు. ధనియాల పరిమాణం ఎక్కువగా ఉంటే మంచి సువాసన వస్తుంది. చింతపండు వల్ల స్వల్ప పులుపు వచ్చి కారం రుచి పెరుగుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో నిల్వ చేయాలి. ఈ నల్లకారం వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోసెతో, ఉప్మా, పొంగల్‌తో, గారెలు, బొండాలతో దేనిలో వేసుకుని తిన్నా రుచి అదిరిపోతుంది. అన్నట్లు ఈ నల్లకారం 2 - 3 నెలల వరకు నిల్వ ఉంటుంది.

5 / 5
Follow Us
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్

పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు

నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌

నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!