రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. RRB గ్రూప్ డీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
RRB Group D Exam Scheudle 2026: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బీ కీలక అప్‌డేట్ జారీ చేసిది. దేశవ్యాప్తంగా గ్రూప్ డీ ఖాళీల భర్తీకి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన ఈ పోస్టులకు వివిధ హోదాల్లో నియామకాలు ఉంటాయి..

హైదరాబాద్, జులై 5: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో గ్రూప్ డి పోస్టుల భర్తీకి ఇటీవల ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 22,195 రైల్వే గ్రూప్ డీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ ఆన్‌లైన్ రాత పరీక్షలు ఆగస్టు 3 నుంచి 21 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 22,195 గ్రూప్ డి ఖాళీలను పదో తరగతి అర్తతో భర్తీ చేస్తోంది.
ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపికైన వారిని పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర హోదాల్లో నియమిస్తారు. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో తెలిపింది.
మొత్తం పోస్టుల్లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని సికింద్రాబాద్‌లో మొత్తం 1012 ఖాళీలు ఉన్నాయి. CBT ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
