AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ప్రింటర్ నుంచి 500 నోట్లు.. ఓటీటీలో ‘ఓజీ’ నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓజీ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 9.1 రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: ప్రింటర్ నుంచి 500 నోట్లు.. ఓటీటీలో 'ఓజీ' నటుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 07, 2026 | 7:44 PM

Share

ఇప్పుడు ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్ కు మంచి ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమా గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్. ఓజీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన అర్జున్ దాస్ ఈ మూవీలో హీరోగా నటించాడు. జూన్ 26న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. డిఫరెంట్ స్టోరీ, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇక ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10కి 9.1 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. శరవణన్ (అర్జున్ దాస్) ఆయన భార్య (అన్నా బెన్) దివ్యాంగుడైన తమ కుమారుడితో కలిసి జీవిస్తుంటారు. వీరితో పాటే అత్త, బావమరిది కూడా ఒకే ఇంట్లోనే ఉంటారు. డబ్బు సంపాదన కోసం వీరంతా రకరకాల స్కామ్స్ చేస్తుంటారు. అలా శరవణన్ ఒకరికి భారీగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే సదరు వ్యక్తి శరవణన్ ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు హీరో విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఆ ఫ్రస్టేష‌న్‌లో ఒక రోజు ఇంట్లో వస్తువులన్నింటినీ విసిరేస్తాడు. అదే టైంలో ప్రింటర్ విసిరేస్తుండగా.. పిడుగు పాటు కారణంగా దాని బటన్ ప్రెస్ అయ్యి రూ. 500 నోట్లు వస్తాయి. అలా బటన్ నొక్కడంతో డబ్బుల వరద కురుస్తూనే ఉంటుంది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. ఆ తర్వాత భార్య తో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా సీక్రెట్ గా ఆ మెషీన్ నుంచి డబ్బులు తీసుకుంటుంది.

అయితే ఓ రోజు ప్రింటర్ విలువ తెలియక శరవణన్ కుమారుడు డాబాపై దానితో ఆడుకుంటాడు. దీంతో పొరపాటుగా బటన్ ప్రెస్ అయ్యి ఆ ఏరియా అంతా 500 నోట్ల కట్టలతో నిండిపోతుంది. సరిగ్గా అప్పుడే వీరి కుమారుడు కూడా కిడ్నాప్ అవుతాడు. మరి శరవణన్ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఏం చేశాడు? అసలు ప్రింటర్ నుంచి డబ్బులు ఎలా వచ్చాయన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు కాన్ సిటీ. అర్జున్ దాస్ కు జోడీగా ‘కల్కి 2898AD’లో కైరా పాత్రలో అలరించిన అన్నా బెన్ హీరోయిన్ గా నటించింది. హరీష్ దురైరాజ్ సినిమాకు దర్శకత్వం వహించగా… యోగిబాబు, రాధా రవి, తంబి రామయ్య, వడి వుక్కరసి, వీటీవీ గణేష్, రమేష్ తిలక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా జులై 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

కాన్ సిటీ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us