AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinders: గ్యాస్ సిలిండర్లు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయో తెలుసా..? కలర్స్ వెనుక అసలు నిజం ఇదే..

గ్యాస్ సిలిండర్లు వేర్వేరు రంగుల్లో ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. రెడ్, బ్లూ, వైట్, పసుపు లాంటి వేర్వేరు రంగుల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇలా వేర్వేరు రంగుల్లో సిలిండర్లు ఎందుకు ఉంటాయనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

Gas Cylinders: గ్యాస్ సిలిండర్లు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయో తెలుసా..? కలర్స్ వెనుక అసలు నిజం ఇదే..
Gas Cylinders
Venkatrao Lella
|

Updated on: Jul 07, 2026 | 7:36 PM

Share

గ్యాస్ సిలిండర్లు వేర్వేరు రంగుల్లో ఉండటం మీరు చూసే ఉంటారు. ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటే.. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే సిలిండర్లు బ్లూ కలర్‌లో ఉంటాయి. ఇక హాస్పిటల్స్, ఫ్యాక్టరీలలో వాడే సిలిండర్లు మరో రంగుల్లో ఉంటాయి. ఇలా సిలిండర్లు వేర్వురు రంగుల్లో ఎందుకుంటాయనే అనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది. ఈ రంగులు సిలిండర్లను ఏ అవసరానికి వాడుతున్నారే విషయంతో పాటు గ్యాస్ రకాన్ని కూడా గుర్తించడంలో సహాయపడతాయి. సిలిండర్ల భద్రతకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంతకు ఏ రంగు సిలిండర్ ఎందుకు ఉపయోగిస్తారు? వాటికి ఉన్న ప్రత్యేక ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్ కలర్ సిలిండర్

మన ఇంట్లో రెడ్ కలర్ సిలిండర్ ఉంటుంది. ఈ రంగు సిలిండర్లను కేవలం వంట అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో గృహ అవసరాల కోసం సరఫరా చేసిన ఎల్పీజీ గ్యాస్ ఉంటుంది. ఎల్పీజీ గ్యాస్ అత్యంత మండే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే దానిని జాగ్రత్తగా ఉపయోగించాలని రెడ్ కలర్ సూచిస్తుంది.

బ్లూ కలర్ సిలిండర్

రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్లు, క్యాటరింగ్ లాంటి వాణిజ్య అవసరాల కోసం బ్లూ కలర్ సిలిండర్ ఉపయోగిస్తారు. ఇంట్లో వాడే సిలిండర్ల కంటే ఇవి కాస్త పెద్దగా ఉంటాయి. ఈ సిలిండర్ల ఖరీదు ఎక్కువగా ఉండటంతో పాటు వీటికి ప్రభుత్వాల నుంచి ఎటువంటి సబ్సిడీ అందదు.

తెలుపు సిలిండర్

తెలుపు రంగు సిలిండర్లను ఆసుపత్రులు, క్లినిక్‌లు, అత్యవసర ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఆక్సిజన్‌ను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. రోగి సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సిలిండర్ల నిల్వ, రవాణా, వినియోగానికి సంబంధించి కఠినమైన భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయి.

పసుపు సిలిండర్

కర్మాగారాలు, పారిశ్రామిక యూనిట్లలో పసుపు రంగు సిలిండర్లు కనిపిస్తాయి. వాటిల్లో ఎల్పీజీ, ప్రొపేన్, బ్యూటేన్ లేదా ఇతర పారిశ్రామిక వాయువులు నిల్వ చేస్తారు. వెల్డింగ్, హీటింగ్, కటింగ్, వివిధ తయారీ ప్రక్రియల కోసం వీటిని ఉపయోగిస్తారు. వీటిల్లో అధిక పీడనంతో కూడిన వాయువులు ఉంటాయి. దీంతో పరిశ్రమలు వీటిని నిల్వ చేసేటప్పుడు భద్రతా నియమాలను పాటిస్తాయి.

బూడిద రంగు సిలిండర్

బూడిద రంగు సిలిండర్‌ను కార్బన్ డయాక్సైడ్ నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. అగ్నిమాపక పరికరాలు, పానీయాల పంపిణీ వ్యవస్థలు, ప్రయోగశాలలు, అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వీటిని ఉపయోగిస్తారు. మైల్డ్ స్టీల్ లేదా అల్యూమినియంతో ఈ సిలిండర్లను తయారుచేస్తారు. అధిక పీడనాన్ని తట్టుకునేలా వీటిని రూపొందిస్తారు.

Follow Us
గ్యాస్ సిలిండర్లు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయో తెలుసా..?
గ్యాస్ సిలిండర్లు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయో తెలుసా..?
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..