ఎపిక్ పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న బేబీ హీరోయిన్ వైష్ణవి
07 July 2026
Pic credit - Instagram
Rajeev
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్ గా మారిపోయింది ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య.
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ లో గుర్తింపు తెచ్చుకుంది.
ముఖ్యంగా షణ్ముక్ జస్వంత్ తో కలిసి ఆమె చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ మంచి విజయం సాధించడంతో పాటు వైష్ణవికి మంచి గుర్తింపు తెచ్చింది.
ఆతర్వాత మెల్లగా సినిమాల్లో ఛాన్స్ లు అందుకోవడం మొదలు పెట్టింది. 2020లో అల వైకుంఠపురములో సినిమాలో తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టింది.
అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించింది. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ నటించింది. ఆతర్వాత హీరోయిన్ అయ్యింది.
2023లో బేబీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో వైష్ణవి పేరు మారుమ్రోగింది.
వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ హిట్స్ మాత్రం పడలేదు.ఇప్పుడు ఎపిక్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ