AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad Landslide: వయనాడ్‌లో విరిగిన కొండచరియలు.. శిథిలాల కింద పలువురు

Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) మీడియాకు తెలియజేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. మీనంగాడిలో మోహరించిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం వెంటనే ప్రమాద..

Wayanad Landslide: వయనాడ్‌లో విరిగిన కొండచరియలు.. శిథిలాల కింద పలువురు
Landslide
Subhash Goud
|

Updated on: Jul 07, 2026 | 1:14 PM

Share

Wayanad Landslide: కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ ప్రదేశంలో ఈ కొండచరియలు విరిగిపడినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ రహదారి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయని అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభించామని వారు చెప్పారు.

వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) మీడియాకు తెలియజేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.

మీనంగాడిలో మోహరించిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుంటోందని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కోజికోడ్‌లోని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని కూడా వయనాడ్‌కు వెళ్లమని ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి వి.డి. సతీసన్ వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో కూడా మాట్లాడారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us