బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉండగా.. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా వాతావరణ పరిస్థితులు, ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు ఇవే.

తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు.. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణలో వర్షాలు..
ఇదిలాఉంటే.. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులతోపాటు.. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది..
🔸మత్స్యకారులకు హెచ్చరిక
▪️వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని #APSDMA వెల్లడించింది. ఇది రాబోయే 24గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. ▪️ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.#lowpressure pic.twitter.com/FiWLjtUATB
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 16, 2026
