AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్.. ఏషియన్ గేమ్స్‌లో ఇదే తొలిసారి!

IND vs PAK: భారత్-పాకిస్థాన్ క్రికెట్ ఫైనల్, హాకీ సెమీఫైనల్ ఏషియన్ గేమ్స్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌లుగా నిలిచాయి. OCA వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రెండు పోరాటాలు భారీ ప్రేక్షకాదరణ పొందాయి. క్రికెట్‌లో భారత్ 19 పరుగులతో గెలిచి గోల్డ్ సాధించగా, హాకీలో పాక్‌పై 4-3 విజయం సాధించింది.

IND vs PAK: క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్.. ఏషియన్ గేమ్స్‌లో ఇదే తొలిసారి!
Ind Vs Pak
Rakesh
|

Updated on: Oct 04, 2026 | 4:54 PM

Share

Asian Games 2026: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి ఆ క్రేజ్ క్రికెట్‌ వరకు మాత్రమే పరిమితం కాలేదు. ఏషియన్ గేమ్స్ 2026లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్, హాకీ సెమీఫైనల్ ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌లుగా నిలిచాయి. ఈ విషయాన్ని ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్ (OCA) ఆదివారం అధికారికంగా వెల్లడించింది.

క్రికెట్ ఫైనల్‌కు భారీ ఆదరణ

అక్టోబర్ 3న జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులతో అదరగొట్టగా, తిలక్ వర్మ 22 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

హాకీ సెమీఫైనల్‌లోనూ అదే రచ్చ

క్రికెట్ ఫైనల్‌కు ఒక రోజు ముందు భారత్-పాకిస్థాన్ మధ్య పురుషుల హాకీ సెమీఫైనల్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 4-3తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఒక దశలో 3-3తో స్కోరు సమంగా నిలిచినా.. చివరి దశలో భారత్ కీలక గోల్ చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆ తర్వాత ఫైనల్‌లో మలేషియాను 5-1తో చిత్తు చేసి భారత జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంతో భారత్ పురుషుల హాకీలో ఐదోసారి ఏషియన్ గేమ్స్ గోల్డ్ సాధించింది.

రెండు మ్యాచ్‌లు.. వ్యూయర్‌షిప్‌లో చరిత్ర

OCA సమన్వయ కమిటీ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్బాల్ ప్రకారం.. భారత్-పాకిస్థాన్ క్రికెట్ ఫైనల్ ఏషియన్ గేమ్స్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌గా నిలిచింది. దానికి ముందు జరిగిన భారత్-పాకిస్థాన్ హాకీ సెమీఫైనల్ కూడా గేమ్స్ చరిత్రలో అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన మ్యాచ్‌గా రికార్డయ్యింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లకు వచ్చిన ఖచ్చితమైన ప్రేక్షకుల సంఖ్యను OCA వెల్లడించలేదు.

ఏషియన్ గేమ్స్‌లో మరిన్ని రికార్డులు

ఆయోజకుల ప్రకారం ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్‌లో మొత్తం 54 ప్రపంచ రికార్డులు, 11 జూనియర్ ప్రపంచ రికార్డులు, 89 ఆసియా రికార్డులు, 212 ఏషియన్ గేమ్స్ రికార్డులు నమోదయ్యాయి. మరోవైపు హాంగ్‌జౌ 2023తో పోలిస్తే OCA మార్కెటింగ్, స్పాన్సర్‌షిప్ ఆదాయం 19 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. భారీ టోర్నీ నిర్వహణలో వసతి, రవాణా సమస్యలపై విమర్శలు వచ్చినా.. క్రీడా ప్రదర్శనల పరంగా ఈ ఏషియన్ గేమ్స్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్
క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?