AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax New Rules: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే 7 ఏళ్ల జైలుశిక్ష తప్పదు..

సేవింగ్స్ అకౌంట్లపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ ఉంటుంది. అయితే ఐటీ శాఖ నుంచి మీరు ఈ వడ్డీపై ట్యాక్స్ మినహాయింపులు కూడా పొందవచ్చు. ఇందుకు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఏమైనా తప్పులు సమాచారం ఇస్తే భారీ జరిమానతో పాటు జైలుశిక్ష పడవచ్చు.

Venkatrao Lella
|

Updated on: Jul 07, 2026 | 4:24 PM

Share
ఇటీవల కాలంలో వివిధ ఆర్ధిక అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. సేవింగ్స్ అకౌంట్లను ఎక్కువ మంది కలిగి ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో డిపాజిట్ చేసే సొమ్ముపై కూడా బ్యాంకులు వడ్డీని అందిస్తూ ఉంటాయి. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వడ్డీని జమ చేస్తూ ఉంటాయి. మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లో దీనిని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే వడ్డీ రేటు అనేది చాలా తక్కువగా ఉంటుంది.

1 / 5
అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు సేవింగ్స్ అకౌంట్ల ద్వారా వచ్చే వడ్డీని కూడా పొందుపర్చాలి. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే.. అన్ని అకౌంట్లపై వచ్చిన వడ్డీ వివరాలను అందించాలి. ఒకవేళ ఈ డీటైల్స్ ఇవ్వకపోయినా లేదా తప్పుడు సమాచారం అందించినా చట్టపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుంది. భారీగా జరిమానాతో పాటు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంటుంది.

2 / 5
ఐటీ నిబంధనల ప్రకారం సేవింగ్స్ అకౌంట్లపై వచ్చే వడ్డీ 'ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం'గా పరిగణిస్తారు. దీంతో ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. దీనిని మీ మొత్తం వార్షిక ఆదాయానికి జోడించి మీ పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే పలు మినహాయింపుల కోసం క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. ఈ మేరకు ఐటీ శాఖ అవకాశం కల్పిస్తోంది.

3 / 5
సెక్షన్ 80TTA కింద 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు రూ. 10 వేల వరకు క్లెయిమ్ పొందే అవకాశముంది. ఇక సీనియర్ సిటిజన్లు సెక్షన్ 80TTB కింద రూ.50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటేనే ఈ తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త డిఫాల్ట్ పన్ను విధానంలో ఈ మినహాయింపు అందుబాటులో లేదు.

4 / 5
ITRలో మోసపూరితమైన బ్యాంకు వడ్డీ మినహాయింపులను క్లెయిమ్ చేస్తే  చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 270A ప్రకారం మీరు చెల్లించాల్సిన పన్నుపై 200 శాతం జరిమానాతో పాటు 24 శాతం వార్షిక వడ్డీ రేటును కూడా చెల్లించవలసి ఉంటుంది. మూడు నెలల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడవచ్చు.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!