వెలిగొండ ప్రాజెక్ట్‌పై మరోసారి ఆలోచించుకోండి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

వెలిగొండ ప్రాజెక్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు. రెండు రోజుల కిందట ఆ ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ. వెలిగొండకు అనుమతులు లేవనడం..

వెలిగొండ ప్రాజెక్ట్‌పై మరోసారి ఆలోచించుకోండి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
Veligonda Project
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 29, 2021 | 1:26 PM

వెలిగొండ ప్రాజెక్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు. రెండు రోజుల కిందట ఆ ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ. వెలిగొండకు అనుమతులు లేవనడం సరికాదని, ఆ ఫిర్యాదుపై పునరాలోచన చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఏపీ ప్రభుత్వ తీరు వల్లే ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి లేదని గెజిట్‌లో పెట్టారని, కానీ 2014 విభజన చట్టంలో కల్వకుర్తి, నెట్టెంపాడుతో సహా వెలిగొండ ప్రాజెక్ట్‌ను కూడా పెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఇదిలావుంటే… తాజాగా కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన (AIBP) నిధుల అంశంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌లో కేటాయింపులు లేవని పేర్కొన్నారు. వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు. వెలిగొండకు అనుమతులు లేవన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌ వెలుపలకు నీరు తరలిస్తున్నారని.. ఈ అంశంపై గతంలోనే ఫిర్యాదు చేశామని లేఖలోరాశారు.

అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులివ్వడంపై ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎంత వరకు సబబని లేఖలో ప్రశ్నించారు. ఏఐబీపీ కింద వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే అర్హత ఉందో లేదో పునఃపరిశీలించాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఈఎన్‌సీ మురళీధర్‌ కోరారు.

అయితే ఇప్పుుడు తాజాగా టీడీపీ నాయకులు కొందరు సీఎం కేసీఆర్‌కు లేఖలు రాయడం ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..

TV9 Exclusive: ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..