అక్కడ మీరు.. ఇక్కడ మేము.. 20 ఏళ్లు అధికారం మనదే.. కేంద్ర మంత్రి సమక్షంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర కామెంట్స్
అక్కడ మీరు.. ఇక్కడ మేము.. 15 ఏళ్లు లేదంటే 20 ఏళ్లు. అధికారంలో ఉండటం ఖాయం. మీరు, మేము కలిసి తెలంగాణను మరింత అభివృద్ధి చేద్దాం. ప్రతి ఒక్కరికీ మేలు చేద్దాం. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాల..
అక్కడ మీరు.. ఇక్కడ మేము.. 15 ఏళ్లు లేదంటే 20 ఏళ్లు. అధికారంలో ఉండటం ఖాయం. మీరు, మేము కలిసి తెలంగాణను మరింత అభివృద్ధి చేద్దాం. ప్రతి ఒక్కరికీ మేలు చేద్దాం. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ మాటలు ఎవరన్నా ఇంట్రస్టింగే మారాయి. ఎందుకంటే తెలంగాణ రాజకీయంలో మాటల యుద్ధం పీక్ స్టేజ్‌లో ఉంది. ఒక వైపు బండి పాదయాత్ర నడుస్తోంది. అదే టీఆర్‌ఎస్‌కు, బీజేపీకి మధ్య పొలిటికల్ వార్‌ను మరింత పెంచింది.
సరిగ్గా ఈ టైమ్‌లోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అది కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలోనే. ఉస్మానియా వర్శిటీ అందుకు వేదికైంది. ఉస్మానియా వర్శిటీలో స్పోర్స్ట్ క్లస్టర్స్‌కు శంకుస్థాపన చేశారు కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్. ఖేలో ఇండియా పథకం కింద దీనికి నిధులు కేటాయించారు.
ఈ సందర్భంగానే క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు శ్రీనివాస్‌గౌడ్. ఆ సందర్భంలోనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 15, 20 ఏళ్లు అధికారంలో ఉండటం ఖాయమన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి తెలంగాణను మరింతగా అభివృద్ధి చేస్తాయన్నారు శ్రీనివాస్‌గౌడ్.
ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..