Bengal Coal Scam: దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి.. కుటుంబం జోలికి వస్తే సహించేదీలేదుః మమతా బెనర్జీ
West Bengal Coal Scam: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు పంపించిన వ్యవహారంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు
West Bengal Coal Scam: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు పంపించిన వ్యవహారంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే సహించేదీలేదని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుసు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ సీఎం మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజీరా బెనర్డీకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై స్పందించిన ఆమె.. దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీ..బొగ్గు కుంభకోణంలో టీఎంసీని వేలెత్తి చూపించడంతో, ఏమాత్రంప్రయోజనం లేదని విరుచుకుపడ్డారు. దమ్ముంటే పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. బొగ్గు గనుల స్వాహాలో బీజేపీ మంత్రుల సంగతేంటని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు.
బెంగాల్, అసన్సోల్ ప్రాంతంలోని కోల్‌బెల్ట్ దోచుకున్న బీజేపీ నాయకులను ఎందుకు వదిలివేస్తున్నారని దీదీ నిలదీశారు. గుజరాత్ చరిత్ర ఏంటో తెలుసు, తమపై ఒక కేసు పెడితే మరిన్ని కేసుల్ని వెలుగులోకి తెస్తామని మమతా హెచ్చరించారు.ఈ అంశంపై ఎలా పోరాడాలో తమకు తెలుసన్నారు. ఎన్నికల్లో ఓటమి చెంది..ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఈడీని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు వంటి సహజ వనరుల హక్కుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని మమతా గుర్తు చేశారు.