Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం.. పోలీసులు పక్కన ఉన్నా కూడా ఎంత తెలివిగా కొట్టేశారో చూడండి

యాదాద్రి జిల్లాలో మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతల జేబులకు కన్నాలు వేసి నాలుగు లక్షల రూపాయలకు పైగా...

Telangana: మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం.. పోలీసులు పక్కన ఉన్నా కూడా ఎంత తెలివిగా కొట్టేశారో చూడండి
Thives Hulchal
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 29, 2021 | 3:56 PM

యాదాద్రి జిల్లాలో మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం ప్రదర్శించారు. మంత్రుల పక్కనున్న నాయకుల మధ్యలో దూరి భారీగా డబ్బు కాజేశారు. ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతల జేబులకు కన్నాలు వేసి నాలుగు లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు. మోత్కూర్ లో శనివారం వ్వవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ హాజరయ్యారు. మంత్రులు పట్టణానికి చేరుకోగానే నాయకులు, కార్యకర్తలు వాహనాల చుట్టుముట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులకు స్వాగతం పలికే సమయంలో కిక్కిరిసిన జనం ఉన్నారు. ఇదే అదునుగా బావించిన దొంగలు మోత్కూర్ జెడ్పీటీసీ భర్త సంతోష్ రెడ్డి జేబులోంచి రూ.40 వేలు, మార్కెట్ వైస్ చైర్మన్ మవ్వల శ్రీనివాస్ జేబు నుంచి రూ. 37 వేలు, శాలిగౌరారంకు చెందిన రైతు జేబు నుంచి రూ. 25 వేలు, అడ్డగూడూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు అరవింద్ జేబు నుంచి రూ. 5 వేల రూపాయలను కొట్టేశారు. దొంగల చేతివాటానికి సంబంధించి కొందరు పోలీసులు ఫిర్యాదు చేయగా.. మరికొందరు మాత్రం నిమ్మకుండిపోయారు. మంత్రుల పర్యటనలో పోలీస్ బందోబస్తు ఉన్న సమయంలోనే దొంగలు ఎటువంటి బెరుకు లేకుండా చేతివాటానికి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది.

కాగా ఈ మధ్య కాలంలో పిక్ పాకెటర్స్ ఈ సభలను, కార్యక్రమాలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ వచ్చే ఈవెంట్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతాలకు వచ్చే పార్టీ నాయకుల వద్ద డబ్బులు ఎక్కువ ఉంటాయని దొంగలు ఈ ప్లేసులను ఎంచుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. గతంలో మంత్రి హరీశ్‌రావు సదాశివపేట పర్యటన సందర్బంగా జేబుదొంగలు వీరంగం సృష్టించారు. ఒకరిద్దరు కాకుండా పదుల సంఖ్యలో నాయకులు, కౌన్సిలర్ల జేబులను దొంగలు కత్తిరించేశారు. ఇక మాజీ హోం మంత్రి నాయిని అంతిమ యాత్ర సమయంలో కూడా జేబు దొంగలు రెచ్చిపోయారు. మరో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పెంబర్తి గ్రామంలోని కంబాలకుంటలో చేపపిల్లల పంపిణీకి వెళ్లిన సమయంలో కూడా జేబు దొంగలు చేతివాటం చూపించారు.

Also Read: హాస్టల్ గదిలో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య.. తెల్లారితే ఇంటికి వెళ్లాలనగా

పెళ్లైన మూడు రోజులకే ప్రెగ్నెంట్ .. కూపీ లాగగా నిజాలు తెలిసి విస్తుపోయిన పోలీసులు