AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder: అతని వయసు 14.. ఆమె వయసు 15.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. బాలికను కలవాలని పిలిచి దారుణ హత్య..!

Argentina: తాను తల్లిని కాబోతున్నానని బాలిక.. బాలుడితో చెప్పింది. ఇది విన్న బాలుడు షాక్‌కు గురై.. ఆమెపై కోపంగా ఊగిపోతూ.. దాడి చేశాడు. విచక్షణ మరిచి మృగంలా ప్రవర్తించాడు.

Murder: అతని వయసు 14.. ఆమె వయసు 15.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. బాలికను కలవాలని పిలిచి దారుణ హత్య..!
Balaraju Goud
|

Updated on: Aug 29, 2021 | 4:42 PM

Share

Boy Friend kills Girl Friend: ఇద్దరు కలిసి చదువుకున్నారు. మైనర్ తీరక ముందే మనసులు కలిశాయి. బాలిక వయసు 15, బాలుడి వయసు 14. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. దీంతో ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే, తాను తల్లిని కాబోతున్నానని బాలిక.. బాలుడితో చెప్పింది. ఇది విన్న బాలుడు షాక్‌కు గురై.. ఆమెపై కోపంగా ఊగిపోతూ.. దాడి చేశాడు. విచక్షణ మరిచి మృగంలా ప్రవర్తించాడు. మెడ, పొత్తిడకడుపు అనేకసార్లు పదునైన ఆయుధంతో పొడిచాడు. దీంతో బాలిక ఘటన స్థలంలోనే మరణించింది. ఈ దారుణ ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది.

అర్జెంటీనాలోని మెండోజాకు చెందిన బాధిత బాలిక.. తన క్లాస్‌మేట్‌తో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బాలిక అతనికి చెప్పింది. అందుకు కారణం అతడేనని పేర్కొంది. దీంతో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ బాలిక చనిపోయేంత వరకు దాడి చేశాడు. ఈ క్రమంలోబాలుడు.. విచక్షణ మరచి ప్రవర్తించాడు. బాలిక తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అలాగే ఆమె మెడపై, పొత్తికడుపులో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించింది. అయితే ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి బాలిక మృతిచెంది ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో.. బాలిక తీవ్రంగా కొట్టడంతో పాటు, కత్తి పోట్లకు గురైందని.. ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు.

స్థానిక నివేదికల ప్రకారం.. బాలికను కలవాలని పిలిచిన బాలుడు.. ఖాళీగా ఉంటున్న ఓ ఇంటి వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో బాలిక అక్కడికి చేరుకుంది. తర్వాత బాలికపై క్రూరంగా దాడి చేసిన బాలుడు, ఆమెను దాదాపు 15 సార్లు వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో పొడిచాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి, ఘటన స్థలం నుంచి పారిపోయాడు.

కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా లభించిన ఆధారాలతో బాలుడిని పోలీసులు గుర్తించారు. అక్కడ అతని తల్లి సమక్షంలో బాలుడిని ప్రశ్నించారు. అప్పుడు బాలుడు తాను నేరం చేసినట్టుగా అంగీకరించాడని పోలీసులు తెలిపారు. బాధిత బాలికను హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తండ్రి ఫాబియాన్ ఫెర్నాండెజ్ స్పందిస్తూ.. నిందితుడు తన కూతురుని చాలా దారుణంగా హత్య చేశాడని అన్నారు. ఆమె ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. అతనికి కఠినమైన శిక్ష విధించాలని కోరారు.

బాలికను హత్య చేయడానిక బాలుడు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు అతని ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారని డెయిలీ స్టార్ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. బాలుడు ప్రస్తుతం జువైనల్ క్రిమినల్ ప్రాసిక్యూటర్ పర్యవేక్షణలో ఉన్నట్టుగా చెప్పారు.