Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: పది వేలకు రెండు పాములు.. భార్య గదిలోకి వదిలి.. వీడియో చెప్పిన షాకింగ్ నిజాలు!

కేరళలో పెను సంచలనం సృష్టించిన ఉతారా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. కేసుకి సంబంధించి కోర్టు తీర్పు వచ్చే వారం వెలువడనుంది..

Shocking: పది వేలకు రెండు పాములు.. భార్య గదిలోకి వదిలి..  వీడియో చెప్పిన షాకింగ్ నిజాలు!
Kerala Case
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Aug 30, 2021 | 8:55 PM

కేరళలో పెను సంచలనం సృష్టించిన ఉతారా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. కేసుకి సంబంధించి కోర్టు తీర్పు వచ్చే వారం వెలువడనుంది. తీర్ప ఎలా ఉండనుందా అని అంతా ఉత్కంఠగా వేచి చూస్తున్న తరుణంలో తాజాగా సీన్‌ రీకన్‌స్ర్టక్షన్‌ సందర్భంగా తీసిన వీడియోను పోలీసులు బయటపెట్టారు. ఈ వీడియోను కోర్టులో ప్రవేశపెట్టారు. వీడియోలో ఓ డమ్మీ బొమ్మను పడుకోబెట్టి పాము చేత కాటు వేయించారు.

ఒకటిన్నర ఏడాది క్రితం అత్తింటి వారినుంచి అదనపు కట్నం ఆశించిన అల్లుడు అది దక్కకపోయేసరికి తాళి కట్టిన భార్యను పాములతో కాటేయించి హత్య చేసిన ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. అదనపు కట్నం కోసం సూరజ్ ఉతారాను వేధించటం మొదలెట్టాడు. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు.

తనకు తెలిసిన పాములు పట్టే వ్యక్తి వద్ద నుంచి పామును కొనుగోలు చేశాడు. భార్య నిద్రపోతున్న సమయంలో బెడ్‌రూమ్‌లోకి పామును వదిలి వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఆ పాము ఉతారాను కాటేసింది. పాము కాటేయడం గమనించిన ఆమె, స్ధానికుల సహాయంతో ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. మొదటి ప్రయత్నం విఫలం కావటంతో.. నెల రోజుల తర్వాత సూరజ్ మళ్లీ సేమ్ ప్లాన్ అమలు చేశాడు. పాములు పట్టేవాడి దగ్గర ఇంకో పామును కొనుగోలు చేసి ఆమె నిద్రిస్తున్న సమయంలో పడకగదిలో వదిలేసి వెళ్లిపోయాడు. రెండోసారి పాము కాటుకు గురైన ఉతారా కన్నుమూసింది. పాము కాటుతో భార్య మరణించిందని ఏడుస్తూ అందరిని నమ్మించి ఆమె అంత్యక్రియలు పూర్తిచేశాడు.

అప్పటికే అల్లుడు వరకట్నం గురించి వేధిస్తున్న విషయం తెలిసిన ఉతారా తల్లితండ్రులకు అల్లుడిపై అనుమానం కలిగింది. గది తలుపులు, కిటికీలు మూసి ఉండగా పాము ఆ గదిలోకి ఎలా వెళ్లింది అనే ప్రశ్న వారిని వేధించింది. పైగా ఒకసారి కాదు అతి తక్కువ సమయంలో రెండుసార్లు పాము కాటుకు గురి కావటంపై అనుమానం పెరిగిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సూరజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. చివరికి భార్యను తానే హత్య చేసినట్లు సూరజ్ ఒప్పుకున్నాడు. రెండు పాములను 10వేల రూపాయలకు కొనుగోలు చేశానని చెప్పాడు. సూరజ్‌తో పాటు అతడికి పాములు విక్రయించిన సురేష్‌ని కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?