AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: కృష్ణాష్టమి రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన రాధేశ్యామ్‌ యూనిట్‌.. అపురూప ప్రేమ కథకు సాక్ష్యం ఈ ఫొటో.

Radhe Shyam: ప్రభాస్‌ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. అద్భుత ప్రేమ కావ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై యావత్‌ ఇండియా వ్యాప్తంగా భారీగా అంచనాలున్నాయి...

Radhe Shyam: కృష్ణాష్టమి రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన రాధేశ్యామ్‌ యూనిట్‌.. అపురూప ప్రేమ కథకు సాక్ష్యం ఈ ఫొటో.
Narender Vaitla
|

Updated on: Aug 30, 2021 | 10:41 AM

Share

Radhe Shyam: ప్రభాస్‌ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. అద్భుత ప్రేమ కావ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై యావత్‌ ఇండియా వ్యాప్తంగా భారీగా అంచనాలున్నాయి. వింటేజ్‌ ప్రేమ కథగా రూపొందుతుండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోయింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కరాణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులు చక్కబడడంతో ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ప్రభాస్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు తాజాగా చిత్ర యూనిట్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. నేడు (సోమవారం) కృష్ణాష్టమిని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ‘రాధేశ్యామ్‌’ సినిమాకు సంబంధించి మరో పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఫొటోలో ప్రభాస్‌ పూజాకు పియానో నేర్పిస్తున్నట్లు ఉంది. ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన చిత్ర యూనిట్‌.. ‘జన్మాష్టమి వేడుకలు జరుగుతోన్న నేపథ్యంలో.. విక్రమాదిత్య, ప్రేరణ నిజమైన ప్రేమకు అసలైన అర్థాన్ని చెబుతున్నారు’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తుండగా.. పూజాహెగ్డే ప్రేరణగా కనిపించనుంది. రాధేశ్యామ్‌ కొత్త పోస్టర్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Also Read: Love O2O Actress: పన్ను కట్టని ప్రముఖ నటి.. మాజీ భర్త ఫిర్యాదు.. రూ. 330 కోట్లను జరిమాన విధించిన ప్రభుత్వం ఎక్కడంటే

Prabhas: డార్లింగ్‌ లిస్ట్‌లోకి మరో సినిమా… ఆ కుర్రడైరెక్టర్ కు ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చాడా.?

Nabha Natesh: గాలి ఎటు తీసుకెళితే అటు వెళ్లండి.. ఈస్మార్ట్‌ బ్యూటీ ఆసక్తికర పోస్ట్‌. నభా లేటెస్ట్ ఫొటోలు చూశారా?

నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..