Hyderabad: హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్.. తొలిసారి డీజీపీ ర్యాంకు అధికారికి బాధ్యతలు
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారి డీజీపీ ర్యాంక్ అధికారికి హైదరాబాద్ సీపీ బాధ్యతలను అప్పగించింది. గతంలో ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిజిగా బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. తాజాగా హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌నును..
హైదరాబాద్, సెప్టెంబర్ 9: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారి డీజీపీ ర్యాంక్ అధికారికి హైదరాబాద్ సీపీ బాధ్యతలను అప్పగించింది. గతంలో ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిజిగా బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. తాజాగా హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌నును నియమించింది.
హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులవడం ఇది రెండోసారి. 2021 డిసెంబరులో అదనపు డీజీపీ హోదాలో హైదరాబాద్ కమిషనర్‌గా నియమితులై రెండేళ్లు సీవీ ఆనంద్ పనిచేశారు. అప్పుడే డీజీపీగా పదోన్నతి పొంది గతేడాది డిసెంబరులో బదిలీపై ఏసీబీ డీజీగా వెళ్లారు. సీపీ హోదాలో పనిచేస్తూ ఏడీజీ హోదా నుండి డీజీ హోదా పొంది పని చేసిన వాళ్ళున్నారు. కానీ డీజీ హోదా పొందిన వారిని నియమించడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలోనూ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్‌పై తనదైన మార్క్ చూపించారు సీవీ ఆనంద్.
ఏసీబీలోను సీవీ ఆనంద్ దూకుడు మామూలుగా లేదు. కేవలం 8 నెలల్లోనే 85 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి పట్టించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇదే అధికం. ఇందులో ఎక్కువ కేసులు 32 రెవిన్యూవే కావడం విశేషం. 8 నెలల కాలంలో మొత్తం109 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 85 మది ప్రభుత్వ ఉద్యోగులు, 24 మంది ప్రయివేటు వ్యక్తులు ఉన్నారు. మరో 103 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి 280 మంది అక్రమార్కులపై ప్రభుత్వనికి నివేదిక అందించారు. ప్రస్తుత డీజీపీ కంటే సీనియర్ సీవీ ఆనంద్ సీనియర్. సీవీ ఆనంద్ 1991 బ్యాచ్‌కు చెందిన వారు కాగా, జితేందర్ 1992 బ్యాచ్‌కి చెందినవారు. ప్రస్తుత సీపీ కె శ్రీనివాస రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. 2023 శాసనసభ ఎన్నికల వరకు హైదరాబాద్ సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు.