Telangana Result: ఎంఐఎం కోట నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ లీడింగ్.. 10 స్థానాల్లో బీజేపీ ముందంజ.. లేటెస్ట్ ట్రెండ్స్..
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో నాంపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. నాంపల్లి స్థానంలో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ గట్టి పోటీ ఇస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో నాంపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. నాంపల్లి స్థానంలో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మజిద్ హుస్సెన్ పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ఉదయం 10.30 గంటల వరకు ఆధిక్యంలో కొనసాగుతుంది.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది..
కార్వాన్, సిర్పూర్ కాగజ్‌నగర్, నిర్మల్, ముథోల్, బోథ్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మహేశ్వరం అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నాయి.
బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు, రాజాసింగ్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..
- కాంగ్రెస్-66
- బీఆర్ఎస్-45
- ఎంఐఎం-4
- బీజేపీ-3
- ఇతరులు -1
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :