AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యాడు.. కట్ చేస్తే..

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో వనపర్తి జిల్లాలో స్పష్టమైంది. ఆత్మకూర్ మండలంలో లారీ డ్రైవర్ మ్యాప్ చెప్పిన దారిలో వెళ్లి నేరుగా కృష్ణా నది ఘాట్‌ వరకు చేరాడు. ఇంకాస్త ముందుకెళ్లి ఉంటే లారీ నదిలోకి వెళ్లేదే. స్థానికుల సహకారంతో పెను ప్రమాదం తప్పింది.

Telangana: గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యాడు.. కట్ చేస్తే..
Google Maps Mishap
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Dec 16, 2025 | 7:44 PM

Share

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని గుడ్డిగా వెళ్తే… కృష్ణానదికి వెళ్లింది ఓ లారీ. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బేతంచర్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్‌కు బండల లోడుతో లారీ బయలుదేరింది. అయితే జాతీయ రహదారి 44 మీదుగా కొత్తకోట వరకు వచ్చిన తర్వాత ఆత్మకూర్ నుంచి మక్తల్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ సహాయంతో ముందుకు సాగాడు లారీ డ్రైవర్ బాషా. ఈ క్రమంలో ఆత్మకూర్ చౌరస్తా చేరుకునే సరికి తెల్లవారుజాము అయ్యింది. అయితే చౌరస్తాలో టర్న్ తీసుకోవాల్సిన డ్రైవర్… గూగుల్ మ్యాప్ ప్రకారం నేరుగా వెళ్లాడు. అలా జూరాల గ్రామం వైపునకు ప్రయాణించాడు. గ్రామం దాటిన తర్వాత సైతం అలానే ముందుకు సాగాడు. ఇంతలోనే లారీ కుదుపులు ఎక్కువ కావడం… కొంత దూరంలోనే నీరు కనిపిస్తుండడంతో ఏదో అనుమానం కలిగింది. ఒక్కసారిగా లారీ నిలిపి దిగి చూడగా… దెబ్బకు లారీ డ్రైవర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంకాస్త దూరం వెళ్తే నేరుగా కృష్ణా నదిలోకి లారీ వెళ్లిపోయేది. అప్పటికే లారీ నది తీరంలోని ఘాట్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా పెను ప్రమాదం తప్పిందని భావించాడు. వెంటనే లారీ టైర్ల కింద రాళ్లను అడ్డుపెట్టి ముందుకు వెళ్లకుండా నిలిపాడు. గ్రామస్థులకు సమాచారం అందించి… జరిగిన విషయం లారీ ఓనర్‌కు చెప్పాడు.

గూగుల్‌ను గుడ్డిగా నమ్ముకుంటే ఇలానే అవుద్దని స్థానికులు లారీ డ్రైవర్ బాషాకు చురకులు అంటించారు. స్థానికుల సహాయంతో లారీలోని బండల లోడ్‌ను మరో లారీలోకి ఎక్కించారు. ఇక జేసీబీ సహాయంతో ఘాట్‌పైన ఉన్న లారీని వెనక్కి లాగి రోడ్డు పైకి ఎక్కించి తిరిగి పంపించేశారు. ఇక నుంచి గుడ్డిగా గూగుల్ మ్యాప్స్‌ను కాకుండా సందేహం ఉన్న చోట స్థానికులను అడిగి తెలుసుకోవాలని జూరాల గ్రామస్థులు లారీ డ్రైవర్ బాషాకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!