Telangana: ఫస్ట్ ట్రెండ్స్.. కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి లీడింగ్..
తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతోంది. రౌండ్, రౌండ్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతోంది. రౌండ్, రౌండ్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. హైదరాబాద్‌లో ఎక్కువ చోట్ల బీఆర్ఎస్.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన హేమాహేమీల మధ్య కూడా టఫ్ ఫైట్ జరుగుతోంది.
కామారెడ్డి, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పోటీ చేయగా.. కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, తన సొంత స్థానం కొడంగల్‌లోనూ రేవంత్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. కొడంగల్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 2513 ఓట్లతో రేవంత్ రెడ్డి లీడ్‌లో ఉండగా.. 1981 ఓట్లతో కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు.
Team: Please use these at end of all election articles
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్