ఔటర్ ఒక్కటే బార్డర్.. అడ్డగీతలన్నీ చెరిపేస్తున్న సర్కార్..! జీహెచ్ఎంసీ విలీనం మంచిదేనా?
2 కోట్ల మంది జనాభా.. 2వేల 60 కిలోమీటర్ల వైశాల్యం. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ రేంజ్. దీనికి 'తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్-TCUR' అనే మరో పేరు కూడా ఉంది. ఇంతకీ.. ఎందుకని ఇంత బృహత్ నగరాన్ని సృష్టించాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఒక్కటే. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి ప్రాంతాన్ని మిగతా ఏరియాలతో సమానంగా అభివృద్ధి చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం. హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఒకే తరహాలో డెవలప్ చేయడానికే ORRను ఇక సరిహద్దుగా పెట్టుకున్నాం అనేది ప్రభుత్వ సమాధానం.

గ్రేటర్ హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం తీసుకున్నది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇప్పటిదాకా అతిపెద్ద మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా ఉన్న వాటిని సైతం విలీనం చేసి సిటీని మరింత విస్తరించింది ప్రభుత్వం. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో 150 డివిజన్లు ఉంటే.. ఇప్పుడు వాటిని 300లకు పెంచింది. దీనిపై గెజిట్ కూడా తీసుకొచ్చింది. సరిహద్దులు ప్రకటించింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ దాకా అన్ని మున్సిపాలిటీలను విలీనం చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయే తప్ప ఎక్కడా వ్యతిరేకత రాలేదు. మరి.. విపక్షాలు అడ్డు చెబుతున్నాయి. దాన్నేం అంటారు? అవన్నీ అభ్యంతరాలే. హద్దులు మార్చడం, కలపడం-విడదీయడంపైనే అధికార-విపక్షాలలో అభిప్రాయ భేదాలున్నాయి. ఇది కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇంతకీ ప్రభుత్వం ప్లాన్ ఏంటి? ఎందుకని ఔటర్ రింగ్ రోడ్ దాకా విలీనం చేస్తోంది? ప్రజలకు జరిగే లాభమేంటి? ఒకవేళ నష్టం జరిగితే అది ఎలాంటి నష్టం? ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? వీటన్నింటికీ ప్రభుత్వం ఇస్తున్న సమాధానమేంటి? తెలుసుకుందాం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా చూపుతున్న సర్కార్.. అన్ని ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి అభివృద్ధి చేయాలనేది ప్రధాన ఆలోచన. ప్రస్తుతం ఈ కోర్ అర్బన్ రీజియన్‌లో నాలుగు రకాల పాలన ఉంది. ఈ వ్యత్యాసాలను తొలగించాలంటే.. విలీనం ఒక్కటే మార్గం అని ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నా, అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు విస్తరించాలన్నా, కాలుష్య నియంత్రణ,...




