Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే

కింద్రాబాద్ – కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఈ స్పెషల్‌ రైలు సర్వీసులు కొనసాగనున్నాయి.

Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..  సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే
Sabarimala Special Trains
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2022 | 11:05 AM

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభావార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  సికింద్రాబాద్‌ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ – కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఈ స్పెషల్‌ రైలు సర్వీసులు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్- కొట్టాయంల మధ్య (రైలు నెంబర్ 07117) నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీలతో పాటు 2023 జనవరి 1, 8, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు (రైలు నెంబర్ 07118) నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు 2023 జనవరి 3, 10, 17 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మంగళవారం రాత్రి 11.20 గంటలకు కొట్టాయంలో బయల్దేరి బుధవారం అర్ధరాత్రి 1 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రైళ్లు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప , రాజంపేట, కోడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పొడనూర్, పాలక్కాడ్, షొరనూర్, త్రిసూర్, అల్వాయే, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి. అలాగే నర్సాపురం నుంచి కొట్టాయం (రైలు నెంబర్ 07119 )కు నవంబర్ 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి శనివారం తెల్లవారుజాము 3.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. ఇక కొట్టాయం నుంచి నర్సాపూర్ ( రైలు నెంబర్ 07120) మార్గంలో నవంబర్ 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు శనివారం రాత్రి 10.50 గంటలకు కొట్టాయంలో బయల్దేరి ఆదివారం సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ , తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు , గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అల్వాయే, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి. అలాగే శబరిమల భక్తుల కోసం మరిన్ని ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..