Reliance Jio 5G: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. 5జీ సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో.. అదనపు చెల్లింపులు లేకుండానే అన్‌లిమిటెడ్ డేటా..
హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా ఇదే తరహాలో 5జీ సేవలను అందిస్తున్నట్టు జియో తెలిపింది. జియో ట్రూ-5జీ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా..
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది జియో నెట్‌వర్క్. హైదరాబాద్ , బెంగళూరు సిటీలో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ప్రకటించింది. ఇప్పటివరకు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసిలతోపాటు రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో జియో 5జీ నెట్‌వర్క్ సేవలను పరిచయం చేశారు. ముందుగా ఆయా నగరాల్లో యూజర్లను ఇన్వైట్ చేసి.. ట్రయల్ బేసిస్‌లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత సాధారణ యూజర్లకు సైతం ఈ సేవలను పరిచయం చేశారు. తాజాగా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా ఇదే తరహాలో 5జీ సేవలను అందిస్తున్నట్టు జియో తెలిపింది.టెక్ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్, బెంగళూరుల్లో 5జీ సేవల ప్రారంభంతో, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని జియో తెలిపింది.
సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. జియో ట్రూ-5జీ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది. 500 MBPS నుంచి 1GBPSవేగంతో 5జీ నెట్‌వర్క్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమ్‌తోనే 5జీ సేవలు పొందవచ్చు. అయితే, యూజర్ కచ్చితంగా 5జీ ఫోన్‌ను వాడుతుండాలి.
అయితే హైదరాబాద్ నగరంలో 5జీ సేవలను అందుబాటులోకి విడతలవారిగా తీసుకొస్తోంది. 5జీ సేవలు నగరం అంతటా ఒకేసారి కాకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక 5జీ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను వినియోగదారులు సరిచూసుకోవాల్సి ఉంటుంది.
ఇదిలావుంటే.. ఐఫోన్లలో 5జీ బీటా అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్‌లపై 5జీ సేవలు పొందేందుకు వీలుగా తమ ఐఫోన్లలో 5జీ బీటా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను యాపిల్ అప్‌డేట్ చేసింది. వినియోగదార్లు ఈ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకుని, 5జీ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకే బీటా వెర్షన్ తీసుకొచ్చినట్లు యాపిల్ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం