AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!

అత్తాపూర్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ ప్రాంతాల్లో జరిగిన వరుస ఇంటి చోరీల కేసులను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. అతడి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు చోరీలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Hyderabad: రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
Attapur Theft Case
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 9:11 PM

Share

హైదరాబాద్, జూన్‌ 10: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చోటుచేసుకున్న ఇంటి చోరీల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ఓ యువకుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు చోరీలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిందితుడు రిషబ్ శుక్లా (21) తేజస్వినీ నగర్ ప్రాంతంలో రాత్రి వేళ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నమోదు చేసిన కేసును దర్యాప్తు చేసిన అత్తాపూర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రిషబ్ శుక్లా రాజేంద్రనగర్, హైదర్‌గూడ, అత్తాపూర్ ప్రాంతాల్లో నమోదైన మరో రెండు చోరీ కేసులు, ఒక చోరీ యత్నం కేసులో కూడా అతడి ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

నిందితుడి వద్ద నుంచి సుమారు 20.5 గ్రాముల బంగారు గొలుసు, రెండు బంగారు బ్రాస్‌లెట్లు, లాకెట్, ఉంగరాలు, వెండి బిస్కెట్లు, వెండి గ్లాస్, వెండి ప్లేట్లు, వెండి గిన్నెలు తదితర విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీలకు ఉపయోగించిన బాలెనో కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ కె. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం చేపట్టిన ఆపరేషన్‌లో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువను అంచనా వేస్తున్నామని, కేసులకు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

Follow Us