AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: “అమ్మా… నేనా? ఆఫీసా?”.. 7 ఏళ్ల బాబు ప్రశ్నకు కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..!

సోషల్ మీడియా తరచుగా మనసులను తాకే కథలకు వేదికగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన లావణ్య వడ్డానం అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో జరిగిన ఓ భావోద్వేగ సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులను ఈ వీడియో తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.

Viral Video: అమ్మా... నేనా? ఆఫీసా?.. 7 ఏళ్ల బాబు ప్రశ్నకు కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..!
Son Moved Working Mother Heart
Balaraju Goud
|

Updated on: Jun 10, 2026 | 5:22 PM

Share

సోషల్ మీడియా తరచుగా మనసులను తాకే కథలకు వేదికగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన లావణ్య వడ్డానం అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో జరిగిన ఓ భావోద్వేగ సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులను ఈ వీడియో తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.

లావణ్య ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఒక సాధారణ ఉదయం ఆమె కుమారుడు స్కూల్‌కు వెళ్లే ముందు, “అమ్మా.. ఈ సాయంత్రం ఇంటికి వచ్చాక మనిద్దరం కలిసి ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేద్దామా?” అని అడిగాడు. తన కుమారుడి కోరికను సంతోషంగా అంగీకరించిన లావణ్య, సాయంత్రం తప్పకుండా సమయం కేటాయిస్తానని మాట ఇచ్చింది.

అయితే అనుకున్నట్లుగా పరిస్థితులు జరగలేదు. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా ఆమె ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. తన కుమారుడిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి చాలా అలస్యం అయిపోయింది. అప్పటికే గ్రీటింగ్ కార్డ్ తయారు చేయాలనే ఆ చిన్నారి ఆశ నెరవేరలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తన కుమారుడు అసాధారణంగా మౌనంగా ఉండటాన్ని లావణ్య గమనించింది.

అతని అసంతృప్తిని గమనించిన లావణ్య, కారణం అడిగినప్పుడు, ఆ బాలుడు అడిగిన ఒక ప్రశ్న ఆమెను కుదిపేసింది. “అమ్మా.. నీకు ఏది ముఖ్యం? నేనా.. లేక నీ ఆఫీసా?” అని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న లావణ్య ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. వెంటనే కుమారుడిని దగ్గరకు తీసుకుని, “నువ్వే నా ప్రపంచం. నువ్వు కంటే ముఖ్యమైనది నాకు మరొకటి లేదు” అని చెప్పింది.

అయితే ఆ రాత్రి ఆ ప్రశ్న ఆమె మనసును వెంటాడింది. తన కుమారుడికి ఎందుకు అలాంటి సందేహం వచ్చిందో ఆలోచించింది. తర్వాత పడుకునే ముందు మరోసారి అతనితో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడింది. ఉద్యోగం చేయడం తన బాధ్యతలో భాగమని, కొన్నిసార్లు పని కారణంగా ఆలస్యం అవుతుందని వివరించింది. కానీ అందువల్ల తన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదని, అతడే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని స్పష్టం చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేలాది మంది ఉద్యోగులు, ముఖ్యంగా తల్లిదండ్రులు స్పందించారు. “ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యత సాధించడం చాలా కష్టం. కానీ మీరు మీ కుమారుడికి ఇచ్చిన వివరణ అద్భుతం” అని ఒకరు కామెంట్ చేయగా, “పిల్లల భావాలను అర్థం చేసుకుని వారితో మాట్లాడటం ప్రతి తల్లిదండ్రి నేర్చుకోవాల్సిన విషయం” అని మరొకరు పేర్కొన్నారు.

ఈ సంఘటన ఉద్యోగం చేసే తల్లిదండ్రులు ఎదుర్కొనే భావోద్వేగ సవాళ్లను మరోసారి గుర్తు చేసింది. ఎంత బిజీ జీవితమైనా, పిల్లలకు కేటాయించే కొద్దిపాటి సమయం, వారితో చేసే మనస్ఫూర్తి సంభాషణ ఎంత విలువైనదో ఈ వైరల్ వీడియో స్పష్టంగా తెలియజేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి…

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us