AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారును ఆపిన పోలీసులు.. లోపల 2 పార్శిల్స్.. ఓపెన్ చేయగా

ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా, మద్యం తాగి కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. అనంతరం అతని కారును పక్కకు తీస్తుండగా.. కారులో వచ్చిన వ్యక్తి కంగారు పడుతూ కనిపించాడు. అనుమానం కలిగి కారు అంతా చెక్ చేయగా.....

Hyderabad: డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారును ఆపిన పోలీసులు.. లోపల 2 పార్శిల్స్.. ఓపెన్ చేయగా
Telangana Police
Ram Naramaneni
|

Updated on: Apr 28, 2024 | 5:10 PM

Share

వీకెండ్.. తెలంగాణ పోలీసులు పక్కాగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తారు. ఎవరైనా మద్యం తాగి డ్రైవ్ చేసినట్లు తేలితే వారిపై పక్కాగా కేసు నమోదు చేస్తారు. వాహనాలు స్వాధీనం చేసుకుని.. తర్వాత కౌన్సిలింగ్‌కు రావాలని చెబుతారు. ఇదంతా ఎప్పుడూ జరిగే ప్రాసెస్. వారంతం కావడంతో శనివారం..  రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పట్టణ కోత్వాల్‌గూడ చెన్నమ్మ హోటల్‌ వద్ద ఔటర్‌ రింగురోడ్డు-సర్వీసు రోడ్డు పరిధిలో శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు చేశారు. ఇంతలో ఓ కారు అటు వైపుగా వచ్చింది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్యక్తి కంగారు పడుతూ కనిపించాడు. టెస్టు చేయగా.. మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారును పక్కకు తీసుకెళ్తుండగా… అతడు తత్తరపాటు గురవ్వడంతో.. పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే కారులో తనిఖీ చేయగా.. రెండు అనుమానాస్పద బ్యాగులు కనిపించాయి.

తొలుత ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు ఉంటుందేమో అనుకున్నారు. బ్యాగులు ఓపెన్ చేయగా.. గంజాయి గుప్పుమంది. పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 50కిలోలుగా తేలింది. గంజాయిని.. సీజ్ చేసి.. తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి.. ఎక్కడికి తరలిస్తున్నారు?.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే వివరాల కోసం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?