శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వే‌పై చిరుత కలకలం.. భయంతో పరుగులు పెడుతోన్న సిబ్బంది!

ఫారెస్ట్‌ అధికారుల సహాయంతో దానిని పట్టుకోడానికి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి గాలించారు. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. అప్పటి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరోమారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.

శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వే‌పై చిరుత కలకలం.. భయంతో పరుగులు పెడుతోన్న సిబ్బంది!
Leopard
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 28, 2024 | 3:44 PM

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున రన్‌వేపై పరిగెత్తిన చిరుతను ఎయిర్‌పోర్ట్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. విమానాశ్రయం సమీపంలో చిరుతపులి ఆనవాళ్లు కనిపించటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన మొదలైంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై చిరుత పులి కనిపించటంతో విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వైల్డ్‌లైఫ్ విభాగం సిబ్బంది, జూ అధికారులు.. శంషాబాద్‌ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత కోసం విస్తృత గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు ముందుగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విమానాశ్రయ పరిసరాలను పరిశీలించారు.

శంషాబాద్‌ విమానాశ్రయ పరిసరాల్లో కనిపించింది. చిరుతపులా..? లేదంటే అడవి పిల్లి సంచరిస్తుందా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. కాగా, గతంలో కూడా అడవి పిల్లి సంచరించడంతో చిరుత అనుకొని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేసి అనుమానాలను నివృత్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గతంలో కూడా ఒక చిరుత పులి ఎయిర్ పోర్టు గోడ దూకి వెళ్లిన ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఫారెస్ట్‌ అధికారుల సహాయంతో దానిని పట్టుకోడానికి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి గాలించారు. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. అప్పటి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరోమారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..