Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golden Shower Trees: ఈ చెట్టు నిజంగానే బంగారం కంటే తక్కువేమీ కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

వేసవి కాలంలో చాలా పుష్పించే మొక్కలు, చెట్లు ఎండిపోతాయి. చెట్లు వాటి ఆకులను రాలుస్తాయి. అటువంటి వాతావరణంలో రేల నిండుగా కొత్త అందంతో వికిసిస్తూ ఉంటుంది. పసుపు రంగులో ఉండే అద్భుతమైన పువ్వుల కారణంగా దీనిని ఆంగ్లంలో 'గోల్డెన్ షవర్' అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మార్చి నుండి జూలై వరకు మాత్రమే పుష్పిస్తుంది.. ఈ చెట్టు ఆకులు, పూలు, విత్తనాల ఉపయోగం ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. ఇది కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన ఔషధం అంటున్నారు నిపుణులు. అందాన్ని మెరుగుపరచడానికి పట్టణ ప్రాంతాల్లో రేలను ఉపయోగిస్తుంటారు.

Golden Shower Trees: ఈ చెట్టు నిజంగానే బంగారం కంటే తక్కువేమీ కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Golden Shower Tree
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 28, 2024 | 2:58 PM

గోల్డెన్ షవర్ (రేల చెట్టు)…బంగారు వర్ణంలో ఉండే ఈ చెట్టు పూలు చూసేందుకు కనువిందుగా ఉంటుంది. ఔషధ ప్రయోజనాలు పుష్కలంగా కలిగి ఉంటుందని ఆయుర్వేదం స్పష్టం చేస్తుంది. దీని ఆకుల నుండి మూలాల వరకు అనేక వ్యాధులకు ఆయుర్వేదంలో ఔషధంగా గోల్డెన్‌ షవర్‌ను ఉపయోగిస్తారు. ఈ చెట్టు వేరు, పువ్వు, ఆకు, బెరడు, అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇది అనేక రకాలైన చర్మ వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు., శరీర శక్తిని పెంచడానికి ఇది మంచిది. సోరియాసిస్‌ను నయం చేస్తుంది. సెల్ ఉపరితలాలపై పేరుకుపోయిన టాక్సిన్స్‌ను తొలగించడంలో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.

రేల చెట్టుతో అల్సర్లు, కణితులు, గౌట్, రుమాటిజం, గుండె జబ్బులు, కామెర్లు వంటి వ్యాధులకు కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. రేల కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, విషపూరిత జంతువుల కాటు వల్ల కలిగే ద్రవం, నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ప్రేగు సంబంధిత వ్యాధులు, జ్వరం, కుష్టు వ్యాధి, మధుమేహం చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. రేల చెట్టు బెరడును తురిమి పౌడర్‌గా చేసుకుని పుండ్లు, వాపు ఉన్న చోట పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. రేల చెట్టు ఆకులను మెత్తగా నూరి మజ్జిగలో కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది. పువ్వు కషాయం గుండెల్లో మంట, కడుపు పూతలకి కూడా మంచిదని నమ్ముతారు. పువ్వు కషాయం గుండెల్లో మంట, కడుపు పూతలకి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గోల్డెన్ షవర్ ట్రీ ఆకుల రసం తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఇదీ కాకుండా రేల పువ్వుల వినియోగం మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది .

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రేల ఆకులను బాగా కడిగి ఆపై దానిని మెత్తగా మిక్సీ పట్టుకుని దాని రసం తీయండి. ఈ రసాన్ని రోజూ నాల్గవ కప్పు పరిమాణంలో తీసుకోండి. ఇలా చేస్తూ క్రమంగా బ్లడ్‌ షుగర్‌ నియంత్రలో ఉంటుంది. కొంతమంది దీనిని టీ రూపంలో కూడా తీసుకుంటారు. అయితే, ఇలాంటివి తీసుకునే ముందు దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

రేల ఆకులను చర్మ రోగాలలో ఉపయోగిస్తారు. ఇది వాపులను నొప్పులను తగ్గిస్తుంది. ఆకుల రసాన్ని గాని, ఆకులను మెత్తగా రుబ్బుకుని గాని చర్మంపై పట్టు వేస్తే చాలు. తామర, గజ్జి, అరికాళ్ళు, అరచేతులు మంటలు తగ్గుతాయి. ఈ రకమైన పట్టు వేయడం వల్ల ఉబ్బురోగం వల్ల శరీరంలో చేరిన చెడు నీటిని లాగేస్తుంది. రేల ఆకులను మెత్తగా నూరి నొప్పి గల ప్రదేశాలలో బాగా మర్ధన చేస్తే నొప్పి తగ్గుతుంది. ఈ ప్రక్రియవల్ల మూతి వంకరపోవడం, కనురెప్పలకు ఒక భాగంలో వచ్చిన వాత వ్యాధి ఫెసియల్ పరాలిసిస్ తగ్గిపోతుంది. రేల ఆకులను గాని, పువ్వులను గాని, పచ్చడి గాను, పప్పు గాను వండుకుంటే కూడా పై వ్యాధుల వల్ల బాధ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..