AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే..

లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను ఈ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏడాదిన్నర క్రితం ఒక అందమైన వ్యక్తిని కలిశాను. తన వల్ల నా జీవితం పూర్తిగా మారిపోయిందని ప్రయాణికులందరి సమక్షంలో వివరించాడు.. అలాగే తన ప్రసంగంలో కొనసాగింపుగా.. అతడు తను ప్రేమించిన మహిళ వద్దకు వెళ్లి.. మీరే నాకు ప్రత్యేకమైనవారు.

Watch Video: ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే..
Pilot
Jyothi Gadda
|

Updated on: Apr 27, 2024 | 8:59 PM

Share

కొందరు తాము ఇష్టపడే వ్యక్తికి ప్రపోజ్ చేయడానికి ప్రత్యేక స్థలాన్ని ఎంచుకుంటారు. కాబట్టి ఆ క్షణం, ఆ స్థలం వారికి జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ఓ పైలట్ తన ప్రియురాలికి విమానంలో అందరి ముందు ప్రపోజ్ చేశాడు. పైలట్ ప్రేమను వ్యక్తపరిచిన తీరు చూసి ప్రయాణికులు కూడా మురిసిపోయి చప్పట్ల వర్షం కురిపించారు. వైరల్ వీడియోలో పైలట్‌ తన ప్రియురాలి ముందు మోకరిల్లిన తీరుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. కొందరు భిన్నమైన కామెంట్స్‌తో స్పందించారు.

పైలట్ పేరు కాన్రాడ్ హాంక్, అతను ఫ్లైట్ గాల్లోకి లేచే సమయానికి ముందు అతడు ఒక ప్రకటన చేశాడు..ఈ రోజు ఈ విమానంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇది ఆమెకు ఊహించనిది అని నాకు తెలుసు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను ఈ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏడాదిన్నర క్రితం ఒక అందమైన వ్యక్తిని కలిశాను. తన వల్ల నా జీవితం పూర్తిగా మారిపోయిందని ప్రయాణికులందరి సమక్షంలో వివరించాడు.. అలాగే తన ప్రసంగంలో కొనసాగింపుగా.. అతడు తను ప్రేమించిన మహిళ వద్దకు వెళ్లి.. మీరే నాకు ప్రత్యేకమైనవారు. మీరు నా కలల రాణి.. అంటూ తన ముందు మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటరా అంటూ ప్రపోజ్‌ చేశాడు. అందరి ముందూ మోకాళ్లపై కూర్చొని ఒక చేతిలో పూల గుత్తి, మరో చేతిలో ఉంగరం పట్టుకుని తన ప్రేమను వ్యక్తపరిచాడు.

ఇవి కూడా చదవండి

అప్పుడు ఫ్లైట్ అటెండెంట్ అయిన పౌలా పరిగెత్తి పైలట్‌ని కౌగిలించుకుంది. దాంతో పైలట్ ఆమె వేలికి ఉంగరాన్నిపెట్టాడు. వీరిద్దరి ప్రేమను చూసి ఫ్లైట్‌లోని ప్రయాణికులంతా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు.

ఈ వైరల్ వీడియో పోలాండ్‌కు చెందినదిగా తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు చాలా మంది వీక్షణలు, 14,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?