Poppy Seeds: హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.. ఇలా వాడితే..

చాలా మంది బలహీనమైన ఎముకలతో బాధపడుతుంటారు. అలాంటి సమయాల్లో ఎక్కువ మంది మందులు, పౌడర్లు తీసుకుంటారు. కానీ ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఈ రోజు మనం అలాంటి ఒక హోం రెమెడీ గురించి మీకు చెప్పబోతున్నాం, దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ ఎముకలు సులభంగా బలపడతాయి.

Poppy Seeds: హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.. ఇలా వాడితే..
Poppy Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 27, 2024 | 6:04 PM

ఎండలు దంచికొడుతున్నాయి. ఈ యేడు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అవసరం ఉంటే తప్ప పగటి పూట ఇంటి నుంచి బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, అన్ని కాలాల్లో తిన్నట్టుగా వేసవిలో ఏది పడితే అది తినకూడదని చెబుతున్నారు.. వేసవిలో శరీరంలో నీటిశాతం ఉండేలా, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారపదార్థాల పట్ల ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వేసవిలో ప్రతిరోజూ కొన్ని రకాల విత్తనాలు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. అలాంటి వాటిలో గసగసాలు ఒకటి. వేసవిలో గసగసాలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వేసవిలో గసగసాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గసగసాలు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఇందులో ఐరన్, కాపర్, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు ఉంటాయి. గసగసాలు తింటే పొట్ట చల్లబడుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే చాలా మంది బలహీనమైన ఎముకలతో బాధపడుతుంటారు. అలాంటి సమయాల్లో ఎక్కువ మంది మందులు, పౌడర్లు తీసుకుంటారు. కానీ ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఈ రోజు మనం అలాంటి ఒక హోం రెమెడీ గురించి మీకు చెప్పబోతున్నాం, దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ ఎముకలు సులభంగా బలపడతాయి.

గసగసాలు ఆహారానికి రుచిని అందించడమే కాకుండా, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. ఇది ఎముకలకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. గసగసాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి, అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. గసగసాలు తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. గసగసాలు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వెన్నునొప్పి లేదా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి గసగసాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా గసగసాలు వరంలాంటిది. రోజూ ఉదయాన్నే గసగసాల పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారి ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. మీరు గసగసాల గింజలను అనేక విధాలుగా తినవచ్చు. పాలలో లేదా నీటిలో నానబెట్టిన లస్సీ లేదా షర్బత్ రూపంలో కూడా తీసుకొచ్చు.

ఇది కాకుండా మీరు గసగసాలను పుడ్డింగ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. రోటీ లేదా పరాటాలో గసగసాలు వేసుకుని తినవచ్చు. ఇది కాకుండా సలాడ్‌లో గసగసాలు వేసి రోజూ తినొచ్చు. కాకపోతే,  గసగసాలు పరిమిత పరిమాణంలో తినడం ఉత్తమం. ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం హానికరం. అనారోగ్య సమస్యలు ఉన్నవారు గసగసాలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..