Ridge Gourd: వేసవిలో బీరకాయ తింటే శరీరంలో ఏం జరుగుతుంది? ఈ వివరాలు తెలుసుకోండి

బీరకాయల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. కూరగాయల్లో నీటి శాతం అధికంగా లభించే కూరగాయల్లో ఇవి కూడా ఒకటి. ఇతర కూరగాయలతో పోల్చితే బీరకాయల్లో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా బీరకాయను తినవచ్చు. బీరకాయలో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అదే విధంగా ఫైబర్ కూడా ఉంటుంది. బీరకాయ తింటే ఈజీగా డైజెస్ట్..

Ridge Gourd: వేసవిలో బీరకాయ తింటే శరీరంలో ఏం జరుగుతుంది? ఈ వివరాలు తెలుసుకోండి
Ridge Gourd
Follow us
Chinni Enni

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 27, 2024 | 6:32 PM

బీరకాయల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. కూరగాయల్లో నీటి శాతం అధికంగా లభించే కూరగాయల్లో ఇవి కూడా ఒకటి. ఇతర కూరగాయలతో పోల్చితే బీరకాయల్లో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా బీరకాయను తినవచ్చు. బీరకాయలో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అదే విధంగా ఫైబర్ కూడా ఉంటుంది. బీరకాయ తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇలాంటి బీరకాయను ఈ మండే ఎండల్లో తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీరకాయను సమ్మర్‌లో తింటే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శరీరం హైడ్రేట్ అవుతుంది:

బీరకాయలో నీటి శాతం అనేది ఎక్కువగా లభిస్తుంది. వేసవి కాలంలో బీరకాయ తినడం వల్ల శరీరం డీ హైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటుంది. అంతే కాకుండా బీరకాయలో కూలింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి బీరకాయ తింటే.. శరీరంలో హీట్ తగ్గి చల్లగా రీఫ్రెష్‌గా ఉంటుంది. రోజంతా హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

వేసవి కాలంలో బీరకాయ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. బీరకాయలో ఉండే పోషకాల కారణంగా నీరసం, అలసట దరి చేరకుండా ఉంటారు. వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు నియంత్రణలో ఉంటుంది:

బీరకాయ తింటే బరువు అనేది నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు బీరకాయను తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. వీటి కారణంగా బరువు పెరగకుండా ఉంటారు.

షుగర్ లెవల్స్ కంట్రోల్:

డయాబెటీస్ ఉన్నవారు బీరకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ అవుతాయి. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు బీరకాయ తింటే చాలా మంచిది.

చర్మం – జుట్టు ఆరోగ్యం:

బీరకాయలో విటమిన్స్, మినరల్స్ మెండుగా లభిస్తాయి. కాబట్టి ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. యాక్నే, సన్ ట్యాన్ తొలగించి, వృద్ధాప్య ఛాయలు రాకుండా ఆపుతుంది. అదే విధంగా బీరకాయ తింటే హెయిర్ ఫాల్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. అంతే కాకుండా జట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!