Heart Attack: ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది

వ్యాయాయం నుంచి మొదలు తీసుకునే ఆహారం వరకు అన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే వాటితో పాటు ఈ ఒక్క పనిచేస్తే చాలు గుండెపోటు వచ్చే అవకాశాలు 40 శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్‌పైకి ఎక్కడానికి లిఫ్ట్‌లను ఉపయోగించే బదులు మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మెట్లు ఎక్కడం మంచి వ్యాయామంగా...

Heart Attack: ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
Heart Attack
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 28, 2024 | 9:57 AM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా ఇటీవల చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. శారీరకశ్రమ పూర్తిగా తగ్గిపోవడం, నిద్రలేమి, ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం కారణంగా హృద్రోగాల సంఖ్య పెరుగుతోంది. అయితే పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో మరణించడమే ఇప్పుడు అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయాయం నుంచి మొదలు తీసుకునే ఆహారం వరకు అన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే వాటితో పాటు ఈ ఒక్క పనిచేస్తే చాలు గుండెపోటు వచ్చే అవకాశాలు 40 శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్‌పైకి ఎక్కడానికి లిఫ్ట్‌లను ఉపయోగించే బదులు మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మెట్లు ఎక్కడం మంచి వ్యాయామంగా పరిగణిస్తున్నారు. ఇదేదో నోటిమాటకు చెబుతోన్న విషయం కాదు.

పరిశోధనలు నిర్వహించి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. 35 నుంచి 84 ఏళ్ల వయసుకు చెందిన సుమారు 5 లక్షల మందిని పరిగణలోకి తీసుకొని వారిపై పరిశోధనలు నిర్వహించి మరీ ఈ విషయాన్ని తెలిపారు. మెట్లను ఉపయోగించే వారికి గుండె జబ్బుల కారణంగా మరణించే అవకాశం 39% తక్కువగా ఉందని తేలింది. స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల చిన్న వయస్సులో చనిపోయే అవకాశం 24% తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. అయితే దీంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మరిన్ఇన శారీరక వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. కండరాల్లోకి ఆక్సిజన్‌ను బాగా పంప్‌ చేయడంలో వ్యాయామం ఉపయోగపడుతుంది. మెట్లు ఎక్కడాన్ని దినచర్యలో చేర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి ఇది మంచి మార్గం అని పరిశోధకులు అంటున్నారు.వీటితో పాటు తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఒత్తిడిని హ్యాండిల్‌ చేసే ట్రిక్స్‌ను పాటించడం లాంటివి చేయడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..