AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver: సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇవి తింటే కొవ్వు ఇట్టే కరుగుతుంది..

ప్రస్తుత కాలంలో చాలామంది ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం, సరైన ఆహారం తినకపోవడం, మద్యం తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.. ఫ్యాటీ లివర్ సమస్యను రెండుగా విభజిస్తారు.. ఆల్కాహాలిక్, నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ గా పేర్కొంటారు.

Fatty Liver: సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇవి తింటే కొవ్వు ఇట్టే కరుగుతుంది..
Fatty Liver
Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2024 | 8:36 AM

Share

ప్రస్తుత కాలంలో చాలామంది ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం, సరైన ఆహారం తినకపోవడం, మద్యం తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.. ఫ్యాటీ లివర్ సమస్యను రెండుగా విభజిస్తారు.. ఆల్కాహాలిక్, నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ గా పేర్కొంటారు. వాస్తవానికి రోజూ బయట వేయించిన ఆహారాన్ని తినడం, మద్యం తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. రోల్స్, బిర్యానీ, మటన్, బర్గర్లు, చిప్స్, శీతల పానీయాలు రోజు తీసుకుంటే.. కాలేయంపై కొవ్వు పొర ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ సైలెంట్ కిల్లర్.. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం తేలికగా గుర్తించలేరు. ఫ్యాటీ లివర్ నిర్ధారణ అయిన తర్వాత, మొదట చేయవలసినది ఆహారాన్ని మార్చడం. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నింటిని మార్చి.. మంచి ఆహారాన్ని తీసుకోవాలి..

రోజూ ఆఫీసుకు వెళ్లాల్సిన వారికి ఉదయం, మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేసే అవకాశం ఉండదు. ఉదయం, మధ్యాహ్నానికి ఏది దొరికితే.. అది తీసుకుంటారు.. నాణ్యమైన ఆహారం తీసుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తృప్తిగా రాత్రివేళ భోజనం చేస్తారు. కొవ్వు కాలేయం ఉన్నట్లయితే, రాత్రిపూట ఆహారం మంచిగా తీసుకోవడం అవసరం. ఫ్యాటీ లివర్ పేషెంట్లు డిన్నర్‌లో మంచి ఫుడ్ తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.. ఆ ఆహార పదార్థాలేంటో ఒకసారి చూడండి..

రాత్రి పూట ఈ పదార్థాలను తీసుకోండి..

తృణధాన్యాలు: అది అల్పాహారం లేదా రాత్రి భోజనం అయినా.. ఫ్యాటీ లివర్ రోగులు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.. తృణధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రాత్రి పూట గొధుమ లేదా తృణధాన్యాల రొట్టెతో పాటు బ్రౌన్ రైస్, డాలియా, ఓట్స్ మొదలైనవి తినవచ్చు.

పప్పు: ఫ్యాటీ లివర్ పేషెంట్లు బరువును మెయింటైన్ చేయాలి. చాలా మంది రాత్రి భోజనం మానేస్తారు. ఈ తప్పు చేయవద్దు. కనీసం ఒక పప్పు (పప్పు అన్నం) అయినా తిని నిద్రపోండి. పప్పులో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది.

చేపలు చికెన్: మీకు కొవ్వు కాలేయం ఉంటే రెడ్ మీట్‌ను అస్సలు తినవద్దు.. అయితే, మీరు చేపలు, చికెన్ రెండింటినీ తినవచ్చు. మధ్యాహ్నం చేపలు, చికెన్ తినడం మంచిది. అయితే ఉదయం తినకపోతే సాయంత్రం భోజనంలో చేపలు లేదా చికెన్ తినవచ్చు. కొవ్వు తక్కువగా ఉండే చికెన్ బ్రెస్ట్ ముక్కలను తినండి.

గుడ్డులోని తెల్లసొన: కొవ్వు కాలేయంతో బాధపడుతున్న వారు గుడ్లు తినవచ్చు. అయితే, రాత్రిపూట అయితే గుడ్డు లోని సొన (పసుపు) భాగం తినకుండా ఉంటే మంచిది. గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కావున రాత్రి భోజనంలో తినడం మంచిది..

పచ్చి కూరగాయలు: కూరగాయలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. ఎల్లప్పుడూ రాత్రివేళ వెజిటబుల్ కర్రీని తినవచ్చు. ఇది కడుపుని కూడా నింపుతుంది.. శరీరంలో పోషకాహార లోపాన్ని సృష్టించదు. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..