Lifestyle: ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..

విటమిన్‌ డీ లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని తెలిసిందే. అయితే విటమిన్‌డీ లోపం కారణంగా క్యాన్సర్‌ ప్రమాదం కూడా పెరుగుతుందని మీకు తెలుసా.? అవును శరీరానికి సరిపడ విటమిన్‌ డీ లభించకపోతే దీర్ఘకాలంలో క్యాన్సర్‌ బారినపడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు....

Lifestyle: ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
Cancer
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 28, 2024 | 8:57 AM

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలకు ఎండ తగిలితేనే మండిపోతున్నారు. అయితే చుక్కలు చూపిస్తున్న ఎండ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా సహజంగా విటమిన్‌ డీ లభించాలంటే కచ్చితంగా సూర్యరశ్మి పడాల్సిందే. ప్రస్తుతం కాలాంలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌, గంటల తరబడి ఏసీల్లో ఉండడంతో చాలా మంది విటమిన్‌ డీ లోపంతో ఇబ్బంది పడుతున్నారు.

విటమిన్‌ డీ లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని తెలిసిందే. అయితే విటమిన్‌డీ లోపం కారణంగా క్యాన్సర్‌ ప్రమాదం కూడా పెరుగుతుందని మీకు తెలుసా.? అవును శరీరానికి సరిపడ విటమిన్‌ డీ లభించకపోతే దీర్ఘకాలంలో క్యాన్సర్‌ బారినపడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సూర్యకాంతిలో ఉన్నప్పుడు శరీరం ఉత్పత్తి చేసే పోషకం క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని ఇది పూర్తిగా తగ్గిస్తుందని చెబుతున్నారు.

విటమిన్‌ డీ లోపం కారణంగా క్యాన్సర్‌ బారిన పడినట్లు పలు పరిశోధనల్లో సైతం తేలింది. డెన్మార్క్‌లోని 1.5 మిలియన్ల మంది నుంచి డేటా సేకరించిన తర్వాత ఈ విషయాన్ని పరిశోధకులు దృవీకరించారు. విటమిన్ డి ఉన్న క్యాన్సర్ రోగులు రోగనిరోధక శక్తి చికిత్సలకు మెరుగ్గా స్పందించే అవకాశం ఉందని మరొక పరిశోధనలో తేలింది. ఇదిలా ఉంటే కేవలం సూర్యరశ్మితోనే కాకుండా సహజంగా కూడా విటమిన్‌డిని పొందొచ్చు. ఇందుకోసం కచ్చితంగా ఆహారంలో కొన్ని ఫుడ్స్‌ను భాగం చేసుకోవాలి.

విటమిన్‌ డీని సహజంగా పొందాలనుకుంటే ఆహారంలో పుట్టగొడుగులు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతీ రోజూ కచ్చితంగా రోజుకో గుడ్డును తీసుకోవాలి. ఇక వారంలో కనీసం రెండు సార్లైనా ఆహారంలో చేపలను భాగం చసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆవు పాలలో కూడా విటమిన్‌ డి పుష్కలంగా లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..