- Telugu News Photo Gallery Has your face become oily after going out in the sun, then use tomato to make shine in this way
Beauty Tips: ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా..? టమాటాతో ఇలా చేస్తే మెరిసిపోతారు..!
ఎండలు దంచికొడుతున్నాయి. వేడి గాలులు ఉక్కిరి వీస్తున్నాయి. చల్లదనం కోసం జనాలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎండలో బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఎండలో తిరగడం వల్ల ముఖం మొత్తం జిడ్డుగా తయారవుతుంది. ఎండకు ముఖం పాలిపోయి అంద విహీనంగా కనిపిస్తారు. ముఖంపై నల్లటి మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు ఇంటికి వచ్చిన తర్వాత ఈ చిన్న చిట్కా పాటిస్తే కోల్పోయిన నిగారింపు తిరిగి సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Apr 27, 2024 | 4:46 PM

టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటోలో లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరానికి సన్ స్క్రీన్ మాదిరి పనిచేస్తుంది. అంతేకాదు టమాటా గుజ్జును చర్మానికి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు, మచ్చలకు ఇది దివ్య ఔషధంలా పని చేస్తుంది. టమాటా గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొటిమలు మాయం అవుతాయి.

ఈ జ్యుసి రెడ్ ఫ్రూట్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మీ చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. టమాటోలో లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరానికి సన్ స్క్రీన్ మాదిరి పనిచేస్తుంది.

అంతేకాదు టమాటా గుజ్జును చర్మానికి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు, మచ్చలకు ఇది దివ్య ఔషధంలా పని చేస్తుంది. టమాటా గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొటిమలు మాయం అవుతాయి.

టమాటాలను క్రమం తప్పకుండా అప్లై చేస్తే చర్మంలోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది . టమాటాలో సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేసే అనేక ఎంజైమ్‌లు ఉన్నాయి. ఇందుకోసం మీరు టమాటా, చక్కెరతో ముఖానికి సున్నితంగా మర్ధన చేయాలి. టమాటాలో ఉండే విటమిన్-ఎ, విటమిన్-సి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. రెట్టింపు అందాన్ని ఇస్తాయి.

టమాటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ సెల్యులార్ డ్యామేజ్ అవకుండా కాపాడుతాయి. అంతేకాకుండా చిన్న వయస్సులో ఏర్పడే వృద్ధాప్య ఛాయలను నివారిస్తాయి. అందుకే వేసవిలో టమాటాలను క్రమం తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. టామాటా జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా చర్మం తాజాగా ఉంటుంది.




