- Telugu News Photo Gallery Remove chemicals from vegetables and fruits like this, check here is details in Telugu
Kitchen Hacks: కూరగాయలు, పండ్ల మీద ఉండే కెమికల్స్‌ని ఇలా తొలగించండి..
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆఖరికి పండ్లు, కూరగాయలు కూడా కల్తీకి గురవుతున్నాయని. పండ్లు, కూరగాయలు నిల్వ ఉండటానికి, త్వరగా పండించడానికి హానికరమైన రసాయనాలు అనేవి వాటిపై చల్లుతున్నారు. ఇలాంటి రసాయనాలు చల్లిన ఆహారాలు తింటే.. అనేక జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రావచ్చు. కాబట్టి పండ్లు, కూరగాయలను తినే ముందు..
Updated on: Apr 27, 2024 | 4:48 PM

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆఖరికి పండ్లు, కూరగాయలు కూడా కల్తీకి గురవుతున్నాయని. పండ్లు, కూరగాయలు నిల్వ ఉండటానికి, త్వరగా పండించడానికి హానికరమైన రసాయనాలు అనేవి వాటిపై చల్లుతున్నారు.

ఇలాంటి రసాయనాలు చల్లిన ఆహారాలు తింటే.. అనేక జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రావచ్చు. కాబట్టి పండ్లు, కూరగాయలను తినే ముందు శుభ్రంగా కడిగి తీసుకోవడం మంచిది.

మార్కెట్ నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చిన వెంటనే నేరుగా తినకుండా శుభ్రంగా నీటితో కడగాలి. ఒక పాత్రలో నీటిని వేసి.. అందులో ఓ పది నిమిషాలైనా పండ్లు లేదా కూరగాయలు ఉంచాలి. ఆ తర్వాత చేతితో బాగా రుద్ది తీసుకోవాలి.

అలాగే పండ్లు, కూరగాయలపై ఉండే కెమికల్స్‌ను తొలగించడంలో సాల్ట్ వాటర్ కూడా చక్కగా పని చేస్తాయి. సాల్ట్ వాటర్‌లో కాసేపు పండ్లను ఉంచి.. ఆ తర్వాత తినాలి. ఇలా చేయడం వల్ల పండ్ల మీద ఉండే కెమికల్స్ వదులుతాయి.

పండ్లు, కూరగాయలపై ఉండే కెమికల్స్‌ను వదిలించడంలో వెనిగర్ కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. వెనిగర్ వేసిన నీటిలో పండ్లను, కూరగాయలను కాసేపు ఉంచి నీటితో కడగాలి. అలాగే పండ్లు, కూరగాయల తొక్క తీసి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల హానికర రసాయనాలు శరీరం లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చు.




