Get Rid of Lice: తలలో పేలు ఎక్కువగా ఉన్నాయా.. వీటితో చెక్ పెట్టండి!

పేలతో చాలా మంది ఇబ్బంది పడే ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ తలలోకి చేరి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల్లో అయితే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పేలు తలపై రక్తం తాగుతూ ఉంటాయి. ఈ పేల వల్ల కూడా చాలా మందిలో రక్త హీనత సమస్య ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ పేలు ఒకరి నుంచి మరొకరికి వస్తాయి. ఎక్కువగా దురద పెడుతూ ఉంటాయి. అందులోనూ వేసవి కాలంలో ఈ పేలతో మరింత..

|

Updated on: Apr 27, 2024 | 5:13 PM

పేలతో చాలా మంది ఇబ్బంది పడే ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ తలలోకి చేరి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల్లో అయితే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పేలు తలపై రక్తం తాగుతూ ఉంటాయి. ఈ పేల వల్ల కూడా చాలా మందిలో రక్త హీనత సమస్య ఏర్పడుతుంది.

1 / 5
అంతే కాకుండా ఈ పేలు ఒకరి నుంచి మరొకరికి వస్తాయి. ఎక్కువగా దురద పెడుతూ ఉంటాయి. అందులోనూ వేసవి కాలంలో ఈ పేలతో మరింత చికాకు వస్తుంది. వీటిని వదిలించుకోవడానికి చాలా మంది మెడిసిన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటి కంటే ఇంట్లోని నేచురల్ టిప్స్ ఉపయోగించడం వల్ల చాలా మంచిది.

2 / 5
తలపై పేలు వదిలించుకోవడానికి వెల్లుల్లి చక్కగా పని చేస్తుంది. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి.. నిమ్మరసంలో కలిపి జుట్టుకి అప్లై చేయాలి. ఓ అరగంట తర్వాత షాంపైతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పేలు పచ్చి పోవడమే కాకుండా.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

3 / 5
ఇంట్లో లభించే బేకింగ్ సోడాతో కూడా పేలను తరిమి కొట్టొచ్చు. కొద్దిగా బేకింగ్ సోడాతో కండీషనర్‌ కలిపి తలకు అప్లై చేయండి. ఓ పావు గంట తర్వాత.. షాంపూతో తలను క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే పేలు చచ్చిపోతాయి.

4 / 5
వేపాకులతో కూడా పేలను దూరం చేసుకోవచ్చు. వేపాకులను శుభ్రంగా కడిగి, పేస్టులో చేసుకోవాలి. ఈ పేస్టును పావు గంట పాటు తలకు పట్టించి.. షాంపూతో స్నానం చేయండి. వేపాకుల్లోని చేదు, ఘాటు వాసన కారణంగా పేలు చనిపోతాయి. అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
Follow us