- Telugu News Photo Gallery Buy these things also on Akshaya Tritiya, you will get profits, check here is details in Telugu
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలా మంది అనుకుంటారు. దీపావళి, ధన త్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చింది. ఈరోజున చాలా మంది లక్ష్మీ దేవిని పూజించి.. పేదలకు దాన ధర్మాలు చేస్తారు. అలాగే బంగారం, వెండి కొంటూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాకుండా ఈ వస్తువులు..
Updated on: Apr 27, 2024 | 6:22 PM

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలా మంది అనుకుంటారు. దీపావళి, ధన త్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు.

ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చింది. ఈరోజున చాలా మంది లక్ష్మీ దేవిని పూజించి.. పేదలకు దాన ధర్మాలు చేస్తారు. అలాగే బంగారం, వెండి కొంటూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాకుండా ఈ వస్తువులు కొన్నా మంచిదేనని జ్యోతిష్యులు అంటున్నారు.

మే 10వ తేదీన ఉదయం 10.54 గంటల వరకు రోహిణీ నక్షత్రం ఉంది. మీరు ఏమైనా ఇంట్లోకి వస్తువుల కొనాలి అనుకుంటే.. రోహిణీ నక్షత్రంలో వెల్లండి. ఈ సమయం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచిదని జ్యోతిష్యులు చెబుతారు.

అక్షయ తృతీయ రోజు వెండి, బంగారమే కాకుండా భూమి, ఇల్లు, వాహనం వంటి వాటిని కూడా కొనొచ్చు. ఈ రోజున వీటిని కొనుగోలు చేస్తే.. సుఖసంతోషాలు చేకూరతాయని జ్యోతిష్యులు చెప్తారు. అంతే కాకుండా ధనాకర్షణ కూడా పెరుగుతుంది.

అక్షయ తృతీయ రోజు మీకు అవసరం ఉన్నా.. లేకపోయినా.. మీ శక్తి కొలదీ ఇంట్లోకి వస్తువులను తీసుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు. అలాగే పేదలకు అన్నదానం చేసినా చాలా మంచిది.





























