- Telugu News Photo Gallery Unexpected benefits of sleeping with tulsi leaves under the pillow, check here is details in Telugu
Tulsi Leaves: దిండు కింద తులసి ఆకుల్ని పెట్టుకుని పడుకుంటే.. ఊహించని ప్రయోజనాలు!
తులసి మొక్కను హిందూ మంతో ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. తులసి మొక్కను పూజించడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ ఒక్కరి ఇంటి ఆవరణలో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. తులసి మొక్కతో ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు దిండు కింద.. తులసి ఆకుల్ని ఉంచి పడుకుంటే ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని..
Updated on: Apr 27, 2024 | 7:29 PM

తులసి మొక్కను హిందూ మంతో ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. తులసి మొక్కను పూజించడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ ఒక్కరి ఇంటి ఆవరణలో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు.

తులసి మొక్కతో ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు దిండు కింద.. తులసి ఆకుల్ని ఉంచి పడుకుంటే ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్యులు అంటున్నారు.

దిండు కింద తులసి ఆకులు ఉంచడం వల్ల నెగిటివిటీ పోయి.. ఇంట్లో సానుకూలత అనేది పెరుగుతుంది. అదే విధంగా మీ మనసులోకి కూడా చెడు ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

తులసి ఆకుల్ని దిండు కింద ఉంచితే మానసిక ఒత్తిడి కూడా తగ్గి పోతుంది. విపరీతమైన కోపం ఉన్నవారు.. దిండు కింద తులసి ఆకులు ఉంచితే.. కోపం అనేది కంట్రోల్ అవుతుంది. మీ మీద ఉండే దిష్టి కూడా తగ్గి పోతుంది.

అదే విధంగా తులసి ఆకుల్ని ఎర్రటి వస్త్రంలో పెట్టి.. తలకింద ఉంచుకుంటే.. ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. మీకు ఎక్కడైనా ధనం రావాల్సింది ఆగిపోతే ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి.. డబ్బు మీ చేతికి అందుతుంది.




