Banana Flower Benefits :ఆరోగ్య సంజీవిని అరటి పువ్వు.. వారానికోసారి తింటే చాలు.. ఈ తీవ్రమైన వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!
అరటి పువ్వులను సాధారణంగా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ అలాంటి సమస్యలకు అరటి పువ్వు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అరటి పువ్వును తరచూగా మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది.
అరటి పండు అందరికీ అందుబాటులో ఉండే, చవకైనది. అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం అరటి పండ్లలో మెండుగా లభిస్తాయి. తియ్యదనంతో, పసుపు, ఎరుపు రంగులో ఉండే అరటిపండ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. ఆకుపచ్చ అరటి కాయలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఆకుపచ్చ అరటి కాయలను కూరగాయ రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఇక అరటి ఆకులను కూడా భోజనం చేసేందుకు వినియోగిస్తారు. అలాగే, ఇటీవలి కాలంలో అరటి ఆకులతో స్నానం చేయించే ఆయుర్వేద వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే, అరటి పువ్వులను సాధారణంగా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ అలాంటి సమస్యలకు అరటి పువ్వు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
పరిశోధన ప్రకారం, అరటి పువ్వులోని ఫైబర్ బరువు తగ్గడానికి, స్థూలకాయాన్ని తగ్గించడానికి అద్భుతమైన ఎంపిక. దీంతో కొవ్వు కూడా తగ్గుతుంది. అరటి పువ్వులలో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఉంటాయి. ఒత్తిడి, మానసిక స్థితిని మంచి స్థితిలో ఉంచడానికి ఇది చాలా మంచిది. అరటి పువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దీంతో శరీరంలోని రక్తహీనత కూడా తొలగిపోతుంది. డయాబెటీస్ బాధితులు అరటి పువ్వుతో చేసిన కూరను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్‌లోకి వస్తాయి. అరటి పువ్వులో ఉండే ఫినోలిక్, ఆమ్లాలు, టానిన్లు, ఫేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా అడ్డుకుంటాయి.
అదనంగా, అరటి పువ్వులలో పొటాషియం, కాల్షియం, రాగి, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం, విటమిన్ ఇ కూడా ఉన్నాయి. అంతేకాదు.. అరటి పువ్వుతో కిడ్నీ సమస్యలు నయం చేసుకోవచ్చు. అరటి పువ్వులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. అరటి పువ్వులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అరటి పువ్వును తరచూగా మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..