Mouth Wash Effects: ప్రతి రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

మౌత్ వాష్ అనేది దంతాల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ కొంతమంది దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నారు. అలాంటి వారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. మౌత్ వాష్‌లను తరచూ వాడడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

Mouth Wash Effects: ప్రతి రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Mouthwash
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 27, 2024 | 3:27 PM

Mouthwash Side Effects:మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది నోటి దుర్వాసన నుంచి బయటపడటానికి మౌత్‌ వాష్‌ని వాడుతున్నారు. ఇది నోటిని శుభ్రంగా ఉంచేందుకు, రోజంతా వాసన రాకుండా తాజాగా ఉంచేందుకు సహకరిస్తుంది. మౌత్ వాష్ అనేది దంతాల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ కొంతమంది దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నారు. అలాంటి వారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. మౌత్ వాష్‌లను తరచూ వాడడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

ఇది దంతాలకు మంచిదే అయినప్పటికీ ప్రతిరోజూ మౌత్ వాష్ వాడటం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ మౌత్ వాష్ వాడకాన్ని పరిమితం చేయాలని సూచిస్తున్నారు. మౌత్ వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది. దీంతో మీ నోరు పొడిబారుతుంది. మౌత్‌ వాష్‌ రెగ్యులర్ ఉపయోగం శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం, మౌత్ వాష్ రెగ్యులర్ ఉపయోగం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు రెండుసార్లు మౌత్‌వాష్‌ని ఉపయోగించేవారిలో పదవ వంతు కంటే ఎక్కువ మందిలో కూడా ఈ అవకాశం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అధిక ఆల్కహాల్ మౌత్ వాష్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. ఇది అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రోజూ మౌత్ వాష్ వాడటం వల్ల దంతాల సమస్య వస్తుంది. దంతాలలో గుర్తులు ఏర్పడుతాయి. దంతాలు బలహీనంగా, గరుకుగా మారుతాయి. రోజూ లేదా అతిగా మౌత్ వాష్ వాడేవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే సింథటిక్ పదార్థాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. కాబట్టి దీనిని కనీసం రెండు రోజులకు ఒకసారి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఇంట్లోనే సహజ సిద్దంగా వేప లేదా పుదీనాతో తయారు చేసుకునే మౌత్‌వాష్‌ను వాడితే మంచిదని చెబుతున్నారు. దీనిని రోజూ ఉపయోగించవచ్చు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!