AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: అనంత్ అంబానీ పెళ్లి.. లండన్, అబుదాబిలో కాదు ఇక్కడే జరగనుంది..! భారీ సన్నాహాలు షురూ..

అనంత్ అంబానీ, రాధిక పెళ్లి ఎక్కడ జరగనుంది..? అనే విషయం తెలుసుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12, 2024న జరగనుంది. అయితే, వీరి వివాహం లండన్‌లో జరుగుతుందని, అబుదాబిలో సంగీత కచేరీ జరుగుతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ ప్లాన్‌లో మార్పు జరిగినట్టుగా తెలుస్తోంది.

Anant Ambani: అనంత్ అంబానీ పెళ్లి.. లండన్, అబుదాబిలో కాదు ఇక్కడే జరగనుంది..! భారీ సన్నాహాలు షురూ..
Anant Ambani
Jyothi Gadda
|

Updated on: Apr 26, 2024 | 9:12 PM

Share

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ. గుజరాత్‌లోని జామనగర్‌లో మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ తర్వాత వీరి వివాహానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అంబానీ కుటుంబంలో చిన్న కుమారుడి పెళ్లిని మరిచిపోలేని విధంగా చేసేందుకు భారీ ఏర్పాట్లు మొదలయ్యాయి. జామనగర్‌లో ఘనంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ల తర్వాత అందరి దృష్టి ఇప్పుడు అనంత్, రాధికల పెళ్లిపై పడింది. అనంత్ అంబానీ, రాధిక పెళ్లి ఎక్కడ జరగనుంది..? అనే విషయం తెలుసుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12, 2024న జరగనుంది. అయితే, వీరి వివాహం లండన్‌లో జరుగుతుందని, అబుదాబిలో సంగీత కచేరీ జరుగుతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ ప్లాన్‌లో మార్పు జరిగినట్టుగా తెలుస్తోంది. అనంత్, రాధికల పెళ్లి లండన్‌లో జరగనుందని సమాచారం. అంబానీ కుటుంబం వివాహ కార్యక్రమాలు లండన్‌లోని 300 ఎకరాల స్థలంలో నిర్వహించనున్నారు. ఈ పెళ్లికి అంబానీ కుటుంబానికి సన్నిహితులు, కొంతమంది బాలీవుడ్ తారలకు ఆహ్వానాలు కూడా పంపడం ప్రారంభించింది.

మార్చి 1నుంచి 3 మధ్య గుజరాత్‌లోని జామనగర్‌లో అనంత్‌ అంబానీ, రాధికల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దేశం, ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖుల పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ అత్యంత ఖరీదైన వేడుకలో ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు, బాలీవుడ్ ప్రముఖులు, ప్రముఖ క్రికెటర్లు పాల్గొన్నారు. నీతా, ముఖేష్ అంబానీల కుమారుడి వివాహానికి ముందు జరిగిన వేడుకకు 120 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1260 కోట్లు) ఖర్చయిందని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్బంగా విచ్చేసిన గ్లోబల్ స్టార్ రిహానా తన నటనకు రూ.60-70 కోట్లు వసూలు చేసినట్టుగా ప్రచారం జరిగింది.

ఇప్పుడు లండన్‌లోని అంబానీ కుటుంబానికి చెందిన విలాసవంతమైన బంగ్లాలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక జరగనుందని వార్తలు వస్తున్నాయి. లండన్‌లోని స్టోక్‌ పార్క్‌ ఎస్టేట్‌లో వివాహ వేడుక జరగనుందని సమాచారం. అయితే, ఈ భవనం జేమ్స్ బాండ్ సిరీస్‌లోని రెండు సినిమాలను చిత్రీకరించిన ప్రదేశం ఇది అని మీకు తెలుసా..? నివేదికల ప్రకారం, అంబానీ కుటుంబం ప్రధాన వివాహ వేడుకను వారి స్వదేశం భారతదేశంలోనే నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, అంబానీ కుటుంబం ఇంకా పెళ్లి లేదా పెళ్లి ఫంక్షన్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..