చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలు తెలిస్తే షాక్ అవుతారు..

చింతపండు థయామిన్, రిబోఫ్లావిన్ ,నియాసిన్ వంటి ముఖ్యమైన మొత్తంలో B విటమిన్లను అందిస్తుంది, అలాగే పొటాషియం, మెగ్నీషియం , ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలను అందిస్తుంది. ఆర్థరైటిస్, ఇతర ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ వంటి పరిస్థితులను నిర్వహించడంలో చింతపండు దోహదపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు , మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, అంతేకాదు..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలు తెలిస్తే షాక్ అవుతారు..
Tamarind Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 26, 2024 | 7:27 PM

చింతపండు ఈ పేరు వింటేనే చాలామంది నోళ్లలో నీళ్లు ఊరుతుంటాయి. చింతపండును కూరలు, పప్పు, ఇతర వంటకాలు, చట్నీలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింతపండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చింతపండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌తో సహా అనేక విటమిన్లను కలిగి ఉంది. చింతపండులో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సరైన ఎముక ఆరోగ్యాన్ని, కండరాల పనితీరును, రక్తపోటు నియంత్రణను నిర్వహించడానికి దోహదం చేస్తాయి. అలాగే, చింతపండులో సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు. పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సహజ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

చింతపండు థయామిన్, రిబోఫ్లావిన్ ,నియాసిన్ వంటి ముఖ్యమైన మొత్తంలో B విటమిన్లను అందిస్తుంది, అలాగే పొటాషియం, మెగ్నీషియం , ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలను అందిస్తుంది. ఆర్థరైటిస్, ఇతర ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ వంటి పరిస్థితులను నిర్వహించడంలో చింతపండు దోహదపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు , మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, యాంటీ డయాబెటిక్, కళ్ళు , చర్మానికి మంచిది.

అంతేకాదు.. చింతపండుతో ఇంట్లోని లోహపు వస్తువులు, పాత్రలు శుభ్రం చేయటానికి కూడా వినియోగిస్తారు. చింతపండుతో శుభ్రం చేసిన ఇత్తడి, రాగి వస్తువులు కొత్తవాటిలా మెరిసిపోతాయని చాలా మందికి తెలియదు. చింతపండుతో వెండి నగలు, వెండి వస్తువులు, రాగిపాత్రలు, ఇత్తడి వస్తువులు ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాదు, మెటల్ కుళాయిలు కూడా చింతపండుతో తిరిగి కొత్తవాటిలా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కిచెన్ సింక్‌కి మరకలు పడటం చాలా మందికి తలనొప్పిని కలిగిస్తంఉది. ఇలాంటి మరకలను శుభ్రం చేయడానికి కూడా చింతపండు ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొంచెం చింతపండు, ఉప్పు ఉంటే చాలు.. సింక్‌ను సింపుల్‌ శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా డ్రై సింక్‌పై కొద్దిగా ఉప్పు వేయండి. తర్వాత చింతపండు వేసి బాగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగితే..సింక్ శుభ్రంగా మారుతుంది. అంతేకాదు.. కిచెన్ చిమ్నీ మురికిగా ఉండి ఇలా మరకలు పడితే చింతపండుతో శుభ్రం చేసుకోవచ్చు.

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!