Godhuma Rava Idli: గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..

గోధుమ రవ్వతో సాధారణంగా ఉప్మా లేదా గోధుమ రవ్వ స్వీట్ తయారు చేస్తూ ఉంటారు. కానీ గోధుమ రవ్వతో ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఉప్మానే కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. అంతే కాకుండా ఇది ఎంతో హెల్దీ కూడా. హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ కావాలి అనుకునేవారు ఇలా ట్రై చేయొచ్చు. అలాగే త్వరగా కూడా అయిపోయింది. ఇవి రుచిగా, సాఫ్ట్‌గా ఉంటాయి. వెరైటీగా కావాలి అనుకునే వారు గోధుమ రవ్వతో ఇడ్లీలను తయారు చేసుకోండి. వీటిని చట్నీ లేదా సాంబార్‌తో..

Godhuma Rava Idli: గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
Godhuma Rava Idli
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 27, 2024 | 12:24 PM

గోధుమ రవ్వతో సాధారణంగా ఉప్మా లేదా గోధుమ రవ్వ స్వీట్ తయారు చేస్తూ ఉంటారు. కానీ గోధుమ రవ్వతో ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఉప్మానే కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. అంతే కాకుండా ఇది ఎంతో హెల్దీ కూడా. హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ కావాలి అనుకునేవారు ఇలా ట్రై చేయొచ్చు. అలాగే త్వరగా కూడా అయిపోయింది. ఇవి రుచిగా, సాఫ్ట్‌గా ఉంటాయి. వెరైటీగా కావాలి అనుకునే వారు గోధుమ రవ్వతో ఇడ్లీలను తయారు చేసుకోండి. వీటిని చట్నీ లేదా సాంబార్‌తో పాటు చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్, జీడి పప్పు, తాళింపులు, పచ్చి బఠానీ, టమాటా ఇలా మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ గోధుమ రవ్వ ఇడ్లీలను ఎలా తాయరు చేస్తారు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోధుమ రవ్వ ఇడ్లీలకు కావాల్సిన పదార్థాలు:

గోధుమ రవ్వ, ఆయిల్, తాళింపు దినసులు, తరిగిన కొత్తి మీర, తరిగిన కరివేపాకు, పుల్లటి పెరుగు, క్యారెట్ తురుము, పచ్చి బఠాణి, వంట సోడా, ఉప్పు, తరిగిన పచ్చి మిర్చి.

గోధుమ రవ్వ ఇడ్లీలు తయారీ విధానం:

ముందుగా కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక.. తాళింపు దినసులు, జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి, కొత్తి మీర, కరివేపాకు, క్యారెట్ తురుము, పచ్చి బఠాణి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత గోధుమ రవ్వ కూడా వేసి ఓ రెండు నిమిషాలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ చల్లారిన తర్వాత ఉప్పు, పెరుగు, వంట సోడా, తగినన్ని నీళ్లు వేసి.. ఇడ్లీ బ్యాటర్‌లా కలుపు కోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఓ పావు గంట పక్కన పెట్టాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇడ్లీ రేకులను తీసుకుని.. ఇడ్లీలు వేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో వీటిని చూసుకుంటూ ఉండాలి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవడమే. వీటిని చట్నీ లేదా సాంబార్‌తో తినొచ్చు. అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఇడ్లీలు రెడీ. వెరైటీగా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి.