AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits of Goat Milk: మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడి చూడండి..

మేకపాలలో ట్రైటోఫాన్‌ అనే ఎమినో యాసిడ్స్‌ చాలా పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సక్రమంగా అందుతాయని చెబుతున్నారు. వాస్తవానికి, మేక పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో మేక పాలు తాగడం వల్ల డెంగ్యూ, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వల్ల వచ్చే వాపు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

Health Benefits of Goat Milk: మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడి చూడండి..
Goat Milk
Jyothi Gadda
|

Updated on: Apr 26, 2024 | 8:43 PM

Share

మనం అందరం ఎక్కువగా ఆవుపాలు, లేదంటే, గేదె పాలనే ఉపయోగిస్తాము. ఈ రెండు పాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఆవు, గేదె పాలే కాకుండా మేక పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. పోషక గుణాలు ఎక్కువగా ఉండే ఈ పాలను తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మేకపాలలో ట్రైటోఫాన్‌ అనే ఎమినో యాసిడ్స్‌ చాలా పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సక్రమంగా అందుతాయని చెబుతున్నారు. వాస్తవానికి, మేక పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో మేక పాలు తాగడం వల్ల డెంగ్యూ, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వల్ల వచ్చే వాపు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

మీరు ఆందోళన , డిప్రెషన్ లేదా మరేదైనా మానసిక సమస్యలతో బాధపడుతుంటే, మేక పాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రోజుకి ఒక్కసారైనా మేకపాలు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. నిజానికి, మేక పాలు శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్తహీనతను దూరం చేస్తుంది..

కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉన్న మేక పాలు శరీరంలోని రక్తహీనతను తొలగించడంలో కూడా చాలా సహాయకారిగా ఉంటాయి. మేకపాలు తాగడం వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. అంతే కాదు మేక పాలు శరీరంలో ఎర్ర రక్త కణాలను కూడా పెంచుతాయి.

కీళ్ల నొప్పులలో ప్రభావవంతంగా ఉంటుంది..

మీకు, మీ చుట్టూ ఉన్నవారికి కీళ్ల నొప్పుల సమస్య ఉంటే, మీరు మేక పాలను కూడా ఉపయోగించవచ్చు. మేకపాలు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం కీళ్ళు, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది నొప్పిని తగ్గించడంలో ఉపశమనాన్ని అందిస్తుంది.

ఆర్థరైటిస్..

కీళ్లనొప్పుల సమస్యలో మేక పాలు చాలా మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులతో పాటు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మీరు తరచుగా ఉదయాన్నే ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతుంటే, మేక పాలు మీకు ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..