Ragi Pindi Punugulu: రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!

రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. రాగి పిండి తీసుకోవడం వల్ల శరీరంలో బలంగా, దృఢంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి. రాగి పిండితో ఇప్పటికే చాలా రకాల వంటకాలను తెలుసుకున్నాం. రాగి పిండితో తయారు చేసే వంటల్లో రాగి పిండి పునుగులు కూడా ఒకటి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా చాలా తక్కువ..

Ragi Pindi Punugulu: రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Ragi Pindi Punugulu
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 27, 2024 | 12:22 PM

రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. రాగి పిండి తీసుకోవడం వల్ల శరీరంలో బలంగా, దృఢంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి. రాగి పిండితో ఇప్పటికే చాలా రకాల వంటకాలను తెలుసుకున్నాం. రాగి పిండితో తయారు చేసే వంటల్లో రాగి పిండి పునుగులు కూడా ఒకటి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఇలాంటి హెల్దీ స్నాక్స్ చేసి పెడితే.. వారు కూడా ఆఱోగ్యంగా ఉంటారు. మరి ఈ టేస్టీ రాగి పిండి పునుగులను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పిండి పునుగులు తయారీ విధానం:

రాగి పిండి, దోశ పిండి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కొత్తి మీర, ఆయిల్, బేకింగ్ సోడా.

రాగి పిండి పునుగులు తయారీ విధానం:

ముందుగా దోశ పిండిని తీసుకోవాలి. ఇందులో రాగి పిండిని వేసి కలపాలి. ఇప్పుడు జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కొత్తి మీర, కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసి.. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్‌ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక.. కలుపుకున్న మిశ్రమాన్ని పునుగులుగా వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

అంతే రాగి పిండి పునుగులు సిద్ధం. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని తినడమే. వీటిని ఏ చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. అదే విధంగా గోధుమ పిండి, రాగి పిండి, మజ్జిగ వేసి కలిపి కూడా పునుగులుగా వేసుకోవచ్చు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతాయి. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి.. పోషకాలన్నీ అందుతాయి.