AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలర్ట్.. 30 ఏళ్లు దాటితే మీ వెన్నముక జర భద్రం.. అందుకే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

ఎముకలు మన శరీరంలో చాలా ముఖ్యమైనవి.. ఇవి మన శరీర నిర్మాణాన్ని సిద్ధం చేస్తాయి. ఎముకలు బలహీనమైతే.. మన శరీరం నొప్పిని అనుభవిస్తుంది.. విపరీతమైన బలహీనత ఉంటుంది. అంతేకాకుండా.. వెన్నెముక మన శరీరానికి చాలా ముఖ్యమైనది. వెన్నముక శరీరానికి కీలకమైనది..

అలర్ట్.. 30 ఏళ్లు దాటితే మీ వెన్నముక జర భద్రం.. అందుకే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Spine Health
Shaik Madar Saheb
|

Updated on: Apr 27, 2024 | 3:26 PM

Share

ఎముకలు మన శరీరంలో చాలా ముఖ్యమైనవి.. ఇవి మన శరీర నిర్మాణాన్ని సిద్ధం చేస్తాయి. ఎముకలు బలహీనమైతే.. మన శరీరం నొప్పిని అనుభవిస్తుంది.. విపరీతమైన బలహీనత ఉంటుంది. అంతేకాకుండా.. వెన్నెముక మన శరీరానికి చాలా ముఖ్యమైనది. వెన్నముక శరీరానికి కీలకమైనది.. కానీ 30 సంవత్సరాల తర్వాత అది కొద్దిగా బలహీనంగా మారే అవకాశముంది. అందువల్ల, ఈ సమస్యను నివారించడానికి, మీరు మన వెన్నెముకకు చాలా మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలను తినవలసి ఉంటుంది.

వెన్నెముక బలహీనతను ఎలా గుర్తించాలి?

మన వెన్నెముక బలహీనంగా మారడం ప్రారంభించినప్పుడు.. నడుము నొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తుంటి నొప్పి, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. చాలా సందర్భాలలో చేతులు, కాళ్ళు తిమ్మిరి లాంటి లక్షణాలు కూడా గమనించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, వెన్నెముకను బలోపేతం చేయడానికి మీరు మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోవడం పెంచాలి. మాంసాహారం తినడం వల్ల ప్రొటీన్ల అవసరం తీరిపోయినా, దీనివల్ల స్థూలకాయం, కొలెస్ట్రాల్ పెరుగుతాయనే భయం ఉంటుంది.

వెన్నెముకను కోసం ఈ ఆహారాలను తినండి

పాల ఉత్పత్తులు..

పాలు, దాని ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకల బలానికి చాలా ముఖ్యమైనది. దీని కోసం మీరు పాలు, పెరుగు, జున్ను తినవచ్చు. అయితే.. కొవ్వు తక్కువ ఉన్న పాలు తీసుకోవడం మంచిది.. లేకపోతే అది బరువు పెరిగేలా చేస్తుంది.

మూలికలు..

30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మూలికల (వృక్ష వేర్ల భాగములు) తీసుకోవడం పెంచాలి. ఎందుకంటే వాటి ఆయుర్వేద లక్షణాలు మన శరీరానికి, ఎముకలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు మీ రోజువారీ ఆహారంలో అల్లం, పసుపు, దాల్చినచెక్క, అల్లం, తులసిని తప్పనిసరిగా తీసుకోవాలి.. రోజుకు రెండుసార్లు హెర్బల్ టీని కూడా త్రాగాలి.

ఆకుపచ్చ కూరగాయలు

గ్రీన్ వెజిటేబుల్స్‌ను సూపర్‌ఫుడ్ అంటారు. ఎందుకంటే వాటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. బ్రకోలీ, కేల్, బచ్చలికూరలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే వెన్ను మంట ఆగి, వెన్నునొప్పి సమస్య తలెత్తదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..