AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరు రివర్స్‌లో ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా..? ఈ వీడియో చూస్తే అవాక్కే..! ఎక్కడో కాదండోయ్..

వీడియోలో, యువకుడు ఒక చిన్న నీటి ప్రవాహం దగ్గర నిలబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ యువకుడు నిలబడి ఉన్న చోట ఒకవైపు కొండ, మరోవైపు వాలు కనిపిస్తుంది. గురుత్వాకర్షణ కారణంగా నీరు ఎల్లప్పుడూ ఎత్తు నుండి దిగువకు ప్రవహిస్తుంది. కానీ, ఇక్కడ దీనికి విరుద్ధంగా జరిగింది. ఈ ప్రదేశంలో వాలు నుండి నీరు ఎత్తైన దిశలో ప్రవహిస్తోందని యువకుడు పేర్కొన్నాడు. దీనిని నిరూపించడానికి అతడు..

నీరు రివర్స్‌లో ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా..? ఈ వీడియో చూస్తే అవాక్కే..! ఎక్కడో కాదండోయ్..
Chhattisgarh
Jyothi Gadda
|

Updated on: Apr 27, 2024 | 8:34 PM

Share

అడవులు, జలపాతాలు, దేవాలయాలు, స్మారక చిహ్నాలతో కూడిన ఛత్తీస్‌గఢ్ భారతదేశంలో చాలా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఛత్తీస్‌గఢ్‌లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు మీ సెలవులను హ్యాపీగా ఎంజాయ్‌ చెయొచ్చు. అలాగే, ఇక్కడ మైన్‌పట్ అనే ప్రాంతం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడి ప్రకృతి అందాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. నిజానికి మైన్‌పట్‌ చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులను కలిగి ఉంటుంది. అందువల్ల వేసవిలో కూడా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి సీజన్‌లోనూ ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. కాబట్టి మీరు ఛత్తీస్‌గఢ్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఖచ్చితంగా ఈ స్థలాన్ని తప్పక చూసిరండి.

మైన్‌పట్‌లో ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. వీడియోలో యువకుడు చెబుతున్న దాని ప్రకారం.. భారతదేశంలో గురుత్వాకర్షణ కూడా పని చేయని ప్రదేశం గురించి చెప్పాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఒక గ్రామం ఉంది. ఇక్కడ నీరు రివర్స్‌లో ప్రవహిస్తుంది. అవును మీరు విన్నది నిజమే. ఇక్కడ నీరు తలక్రిందులుగా ప్రవహిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @jethi_vlogs షేర్ చేశారు. ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లోని మైన్‌పట్‌లోనిది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఉల్టాపానీ అంటారు. వీడియోలో, యువకుడు ఒక చిన్న నీటి ప్రవాహం దగ్గర నిలబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ యువకుడు నిలబడి ఉన్న చోట ఒకవైపు కొండ, మరోవైపు వాలు కనిపిస్తుంది. గురుత్వాకర్షణ కారణంగా నీరు ఎల్లప్పుడూ ఎత్తు నుండి దిగువకు ప్రవహిస్తుంది. కానీ, ఇక్కడ దీనికి విరుద్ధంగా జరిగింది. ఈ ప్రదేశంలో వాలు నుండి నీరు ఎత్తైన దిశలో ప్రవహిస్తోందని యువకుడు పేర్కొన్నాడు. దీనిని నిరూపించడానికి, యువకుడు నీరు పైకి ప్రవహిస్తున్నందున దిగువకు కాకుండా పైకి వెళ్ళే నీటిలో ఒక ఆకును వదలాడు. వీడియో చూసిన తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేరు.

ఈ వీడియోను లక్షలాది మంది ప్రజలు లైక్ చేసారు. అనేక మంది వివిధ స్పందనలను వ్యక్తం చేశారు. “భారతదేశం న్యూటన్ కోసం కాదు” అని ఒక వినియోగదారు అన్నారు. మరొకరు “అది సాధ్యం కాదు అని అంటున్నారు. ఇలా చాలా మంది నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..