Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పోలింగ్ బూత్‌లోకి వచ్చిన అనుకోని అతిథి.. ఒక్కసారిగా జనం పరుగో పరుగు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. చెదురుముదురు సంఘటనలు మినహా.. రెండో దశ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో.. కేరళలోని త్రిచూర్‌ పరియారంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరిన క్రమంలో.. అనుకోని అథితి ఎంట్రీ ఇచ్చింది.

Viral: పోలింగ్ బూత్‌లోకి వచ్చిన అనుకోని అతిథి.. ఒక్కసారిగా జనం పరుగో పరుగు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Elections
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 27, 2024 | 5:33 PM

లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. చెదురుముదురు సంఘటనలు మినహా.. రెండో దశ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో.. కేరళలోని త్రిచూర్‌ పరియారంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరిన క్రమంలో.. అనుకోని అథితి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్యూలైన్లలో ఉన్న ఓటర్లు పరుగులు పెట్టారు. వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భాగంగా (ఏప్రిల్ 26) నిన్న కేరళలోని 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో పరియారం పంచాయతీ బూత్ నంబర్ 79లో పోలింగ్ ప్రశాంతంగా జరగుతుండగా.. బూత్‌లోకి ఓ విషపూరిత పాము ఎంట్రీ ఇచ్చింది. దానిని చూసిన అధికారులు, ఓటర్లు పరుగులు పెట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పోలింగ్ ఆగిపోయింది.

వైపర్ పాము.. కిటికీలోంచి పాకుతూ గదిలో వచ్చిందని అధికారులు చెప్పారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమచారం ఇవ్వగా.. వారు వచ్చి పామును పట్టుకుని గోనె సంచిలో వేసి తీసుకెళ్లారు. వైపర్ పాము ఐదు అడుగుల మేర ఉందని తెలిపారు. పామును పట్టుకుని తీసుకెళ్లే వరకు బూత్‌లో పోలింగ్‌కు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.

Snake

Snake

అయితే.. జనం విషపూరిత పాము అని పేర్కొంటుండగా.. అటవీ అధికారులు మాత్రం.. అడవిలో కనిపించే విషం లేని పాము అని చెబుతున్నారు. కొన్నాకుజి ఫారెస్ట్ స్టేషన్‌లో ఉంచిన పామును అడవిలోకి వదలనున్నట్లు అధికారులు తెలిపారు.

పామును అటవీ శాఖ సిబ్బంది రెస్క్యూ చేయడంతో.. మళ్లీ పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు కొందరు అక్కడే ఉండి.. ఓటు వేసి వెళ్లగా. మరికొందరు మాత్రం ఇళ్లకు వెళ్లిపోయారని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..